Prabhu Hospitalized: నటుడు ప్రభుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!
ఇప్పటికే పలువురు స్టార్స్ పలు సమస్యలతో బాధపడుతుండగా, తాజాగా మరో స్టార్ ఆస్పత్రి పాలయ్యాడు.
- By Balu J Published Date - 01:40 PM, Wed - 22 February 23

గత కొంతకాలంగా హీరోలు తరచుగా అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ పలు సమస్యలతో బాధపడుతుండగా, తాజాగా మరో స్టార్ ఆస్పత్రి పాలయ్యాడు. కడుపులో నొప్పిగా అనిపించడంతో చెన్నై నగరంలోని ఓ ఆస్పత్రికి ప్రభు (Prabhu) వెళ్ళారు. కొన్ని రోజులుగా ఆయనకు కిడ్నీ సమస్య ఉందట.
వైద్య పరీక్షలు చేసిన తర్వాత కిడ్నీలో రాళ్ళు కారణంగా నొప్పి వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. లేజర్ సర్జరీ చేయడం ద్వారా ప్రభు కిడ్నీలో రాళ్లు తొలగించారు. రెండు మూడు రోజుల్లో ఆయన్ను (Prabhu) డిశ్చార్జి చేయవచ్చని సమాచారం. ప్రస్తుతం చెన్నైలోని మెడ్ వే ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం (Health) గురించి వైద్యులు హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు.
Also Read: Kangana Ranaut: గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన కంగనా రనౌత్!