Aamir Khan : ఆల్రెడీ ముగ్గురు భార్యలతో కలిసి వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్లిన ఆమీర్ ఖాన్..
కిరణ్ రావుతో విడిపోయాకా ఇటీవలే తనకు కాబోయే మూడో భార్యని పరిచయం చేసాడు ఆమీర్ ఖాన్.
- By News Desk Published Date - 07:14 AM, Sun - 16 March 25

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ గత మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఆమీర్ ఖాన్ ఇప్పుడు మూడో సారి పెళ్లి చేసుకోబోతున్నాడు. గతంలో ఆమీర్ ఖాన్ రీనా దత్తని మొదట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమెతో విడిపోయాక కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు. 2021 లో వీరు కూడా విడిపోయారు.
కిరణ్ రావుతో విడిపోయాకా ఇటీవలే తనకు కాబోయే మూడో భార్యని పరిచయం చేసాడు ఆమీర్ ఖాన్. గౌరీ స్ప్రాట్ అనే మహిళతో ఆమీర్ ఖాన్ గత సంవత్సర కాలంగా రిలేషన్ లో ఉన్నాడట. ఇటీవలే ఓ ఈవెంట్లో గౌరీని పరిచయం చేసాడు. అధికారికంగా ఇంకా పెళ్లి చేసుకోకపోయినా యిద్దరూ కలిసే ఉంటున్నారు. 60 ఏళ్ళ వయసులో మూడోసారి పెళ్లి చేసుకుంటుండటంతో ఈ వార్త వైరల్ గా మారింది.
అయితే ఆమీర్ గతంలోనే తనకు కాబోయే భార్య, మాజీ ఇద్దరు భార్యలతో కలిసి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వెడ్డింగ్ యానివర్సరీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. గౌరీ గురించి చెప్పడంతో ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఇర్ఫాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో ఈ విషయం తెలిసిందే. అయితే ముగ్గురు భార్యలతో కలిసి వెళ్లడం చూసి ఆశ్చర్యపోతున్నారు అంతా. ఆమీర్ ఖాన్ గతంలో ఇద్దరు భార్యలతో విడిపోయినా వారితో ఇప్పటికి మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు.
Also Read : Sapthagiri : సినిమా వాళ్లకు పిల్లనివ్వరు.. సప్తగిరి వ్యాఖ్యలు.. ఇది ఇంకా మారలేదా..