Balakrishna : బాలయ్య అఖండ 2లో విలన్ రోల్ చేస్తున్న హీరో..? షూటింగ్ చేశాను అంటూ లీక్ చేసిన హీరో..
అఖండ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనపడగా హీరో శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో అదరగొట్టారు.
- By News Desk Published Date - 10:43 AM, Sat - 22 February 25

Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా నుంచి మొదలుపెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇటీవల డాకు మహారాజ్ వరకు వరుసగా నాలుగు సినిమాలు 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి భారీ హిట్స్ కొట్టారు. అఖండ హిట్ తర్వాత దానికి సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
అఖండ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనపడగా హీరో శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో అదరగొట్టారు. అయితే అఖండ 2 సినిమాలో మరో హీరో విలన్ రోల్ చేస్తున్నాడని సమాచారం. హీరో ఆది పినిశెట్టి ఓ పక్క హీరోగా మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మరో పక్క విలన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆది ఫిబ్రవరి 28న శబ్దం సినిమాతో రానున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు.
ఈ ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ ఆది.. బాలకృష్ణ గారి అఖండ 2 సినిమాలో చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేశాను. త్వరలో మరో షెడ్యూల్ ఉంది. అఖండ సినిమాకు మించి పవర్ ఫుల్ గా ఉంటుంది ఈ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో వర్కౌట్ అవ్వొచ్చు అని తెలిపారు. దీంతో ఈ సినిమాలో ఆది పినిశెట్టి బాలయ్యకు విలన్ గా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఆది గతంలో సరైనోడు, ది వారియర్ సినిమాల్లో విలన్ గా చేసాడు.
ఇక బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా కావడం, అఖండ సీక్వెల్ కావడం, ఇటీవల మహా కుంభమేళాలో రియల్ గా షూట్ చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. నిమిషానికి కోటి.. ఆస్తి ఏకంగా రూ.550 కోట్లు.. ఎవరో తెలుసా?