Balakrishna Fan: బాలయ్య ప్లీజ్ రావయ్యా: బాలకృష్ణ వస్తేనే పెళ్లి, లేదంటే క్యాన్సిల్!
అభిమాన హీరో కోసం తన పెళ్లి (Marriage)నే వాయిదా వేసుకున్నాడు ఓ వీరాభిమాని.
- By Balu J Published Date - 01:15 PM, Sat - 11 March 23

అభిమాన హీరో కోసం తన పెళ్లి (Marriage)నే వాయిదా వేసుకున్నాడు ఓ వీరాభిమాని (Balakrishna Fan). ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల ఆగ్రహారానికి చెందిన మాజీ సర్పంచ్ పొలమరశెట్టి వెంకటక్రిష్ణ కుమారుడు పెద్దినాయుడు. వారి కుటుంబానికి బాలయ్య ఆరాధ్య దైవం. రెండేళ్ల క్రితం అతనికి గౌతమీ ప్రియతో పెళ్లి నిశ్చయమైంది. ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. అయితే.. తమ పెళ్లి బాలయ్య సమక్షంలో జరగాలని వారు ఆశించారు. అందుకు ప్రయత్నించారు. అయితే.. అప్పట్లో కరోనా కారణంగా పెళ్లికి తమ అభిమాన నటుడు రావటం సాధ్యం కాదని తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు (Balakrishna Fan).
స్థానిక బాలయ్య అభిమాన సంఘం వారి ద్వారా అప్రోచ్ అయి.. వరుడి పెళ్లి గురించి.. అతను వెయిట్ చేస్తున్న తీరు గురించి చెప్పటంతో.. ముందు ముహుర్తం పెట్టుకొని రావాలని చెప్పారట. దీంతో.. ఈ రోజు (మార్చి 11న) పెళ్లి ముహుర్తాన్ని పెట్టుకున్నారు. ఆ సమాచారాన్ని బాలయ్యకు అందించారు. పెళ్లి పత్రికలోనూ.. ఎన్టీఆర్.. బాలక్రిష్ణ ఫోటోలను పెద్ద ఎత్తున ముద్రించి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పెళ్లికి వచ్చే బాలయ్య కోసం ఊరంతా ఎదురుచూస్తోంది. ఇక.. పెళ్లి కొడుకు (Balakrishna Fan) గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. తన వీరాభిమాని పెళ్లికి బాలయ్య వస్తారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Liquor Queen Kavitha: కవితపై రెచ్చిపోతున్న ట్రోలర్స్.. ‘లిక్కర్ రాణి’ అంటూ ఫొటోలు షేర్!

Related News

Tirumala Hills: తిరుమల కొండపై గంజాయి కలకలం
తిరుమలకొండలోకి గంజాయి ప్రవేశించడంతో భక్తులు, అధికారులు ఆందోళన చెందారు.