Sanjay Dutt and Prabhas: టాలీవుడ్ లో డైనమిక్ కాంబినేషన్.. ప్రభాస్ తాతగా సంజయ్ దత్!
తాజాగా సంజయ్ దత్ మరోసారి సౌత్ సినిమాలో కనిపించబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్‌తో కలిసి నటించబోతున్నాడు.
- By Balu J Published Date - 05:12 PM, Fri - 3 March 23

బాలీవుడ్ (Bollywood) స్టార్ సంజయ్ దత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖంగా వినిపించే పేరు. బాలీవుడ్ లో డిఫరెంట్ పాత్రలు చేసిన ఆయన KGF: చాప్టర్ 2 పవర్ ఫుల్ విలన్ గా బయటపెట్టాడు. అధీరగా శక్తివంతమైన విలన్ పాత్రలో అదరగొట్టిన సంజయ్ దత్ (Sanjay Dutt) కు పలు బాలీవుడ్, టాలీవుడ్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ విలన్ మాత్రం నచ్చిన పాత్రలవైపు మాత్రమే ఇంట్రస్ట్ చూపుతున్నాడు.
కేజీఎఫ్ భారీ మూవీ తర్వాత సౌత్ డైరెక్టర్స్ కు సంజయ్ దత్ ఇప్పుడు ఒక వరంగా మారాడు. ఏదైనా భారీ బడ్జెట్ మూవీ, ప్యాన్ ఇండియా మూవీస్ తెరకెక్కించే నేపథ్యంలో అందరి ద్రుష్టి ఈ విలన్ పై పడుతోంది. తాజాగా సంజయ్ దత్ మరోసారి సౌత్ సినిమాలో కనిపించబోతున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో డాషింగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ (Sanjay Dutt) నటించనున్నాడని సమాచారం. డైనమిక్ ద్వయం నటించిన చిత్రం కీలక సన్నివేశాల చిత్రీకరణ మార్చి చివరిలో ప్రారంభమవుతుంది.
గతంలో తలపతి విజయ్ వారసుడు చిత్రానికి పనిచేసిన అద్భుతమైన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తున్నారు. సంజయ్ దత్, ప్రభాస్ ఇద్దరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ రాబోయే చిత్రం తలపతి 67లో సంజయ్ దత్ (Sanjay Dutt) విలన్‌గా నటించనున్నాడు. మరోవైపు ప్రభాస్ రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు: శృతి హాసన్ నటించిన సాలార్, దీపికా పదుకొనే, దిశా పటాని నటించిన ప్రాజెక్ట్ కె సినిమాలు తెరకెక్కుతున్నాయి.
https://youtu.be/E568ctRIdLE
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్ ఫిక్స్!