Jr NTR Properties: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మీడియా రిపోర్ట్స్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ నికర విలువ దాదాపు రూ. 450 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది.
- By Balu J Published Date - 12:42 PM, Fri - 5 May 23
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ).. సౌత్ ఇండస్ట్రీలో బిగ్ స్టార్. అతని అభిమానులు యంగ్ టైగర్ (Young Tiger) అని ముద్దుగా పిలుచుకుంటారు. రెండు దశాబ్దాలకుపైగా అలరిస్తున్న నందమూరి చిన్నోడికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన అభిమానులు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలని బలంగా కోరుకుంటున్నారు. జూనియర్ పొలిటికల్ (Political) ఎంట్రీపై నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఆ విషయం పక్కన పెడితే తారక్ అత్యధిక పారితోషికం పొందుతున్న భారతీయ తారలలో ఒకడు కూడా. మీడియా రిపోర్ట్స్ ప్రకారం నికర విలువ దాదాపు రూ. 450 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న నటీనటులతో సమానంగా జూనియర్ ఆస్తులు (Assets) ఉన్నట్టు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ కు రూ. 80 కోట్ల విలువైన ఒక ప్రైవేట్ జెట్ ఉంది. రూ. 25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం కూడా ఉంది. ఈ నటుడి విద్ద కోట్ల రూపాయల విలువ చేసే వాచీలు, ఖరీదైన కార్ల (Watch and Cars) కూడా ఉన్నాయట. జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు చిన్నప్నట్నుంచే అద్భుమైన వాచ్ లు అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే వాచ్ లను కలెక్ట్ చేస్తుంటాడు. అతను రిచర్డ్ మిల్లే వాచ్‌ని ధర దాదాపు రూ. 4 కోట్లు అంటే జూనియర్ కు గడియారాలు అంటే ఎంత ఇష్టమో ఇట్టే తెలిసిపోతోంది. ఇక జూనియర్ దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఆయన గ్యారేజీలో ఎన్నో విలువైన కార్లు ఉండటం విశేషం. లంబోర్గినీ కారు నుంచి వివిధ రకాల డిఫరెంట్ కార్లున్నాయి.
ఎన్టీఆర్ కార్స్ కలెక్షన్
5 కోట్ల విలువైన నీరో నోక్టిస్
రేంజ్ రోవర్ విలువ రూ. 2 కోట్లు
2 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ
1 కోటి విలువైన పోర్షే
1 కోటి విలువైన మెర్సిడెస్ బెంజ్
Jr NTR ఆస్తుల్లోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ ముందుంటాడు. నిజానికి అందరు మెచ్చే హీరో కూడా. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 30, హృతిక్ రోషన్‌తో వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో కొమురం భీం పాత్రతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
Also Read: Harish Rao: మోడీ రాష్ట్రపతిని పిలుస్తున్నారా? గవర్నర్ పై హరీశ్ రావు ఫైర్!
Related News
Rahul Gandhi Assets: రాహుల్ గాంధీ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు
రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామినేషన్ పిటిషన్లో తన ఆస్తి వివరాలను పేర్కొన్నారు. అందులో తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ప్రకటించారు. అఫిడవిట్లో ఆయన పేర్కొన్న ఆస్తి విలువ వివరాలు ఇలా ఉన్నాయి: