HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema
  • ⁄37yearsforswathimuthyam Vishwanth Movie Oscar Entry Those Days

Swathi Muthyam: ఆనాడే ‘స్వాతిముత్యం’ మూవీకి ఆస్కార్ ఎంట్రీతో పాటు జాతీయ పురస్కారం!

ఆనాడే 'స్వాతిముత్యం' (Swathi Mutyam) ఆస్కార్ (Oscar) ఎంట్రీతో పాటు జాతీయ పురస్కారం అందుకుంది.

  • By Balu J Updated On - 12:09 PM, Mon - 13 March 23
Swathi Muthyam: ఆనాడే ‘స్వాతిముత్యం’ మూవీకి ఆస్కార్ ఎంట్రీతో పాటు జాతీయ పురస్కారం!

ఇటీవలే ‘కళాతపస్వి’ కె విశ్వనాథ్ (Vishwanath) శివైక్యం చెందారు.ఆయన భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా ఆయన సృజియించిన సినిమాలు ఆయనను చిరంజీవిగా నిలిపాయి.వాటిల్లో ‘స్వాతిముత్యం’  (Swathi Mutyam) ఒక ఆణిముత్యంగా ఎన్నదగినది. ఈ సినిమా విడుదలై నేటికి 37 సంవత్సరాలు పూర్తి చెసుకున్నది. దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న గొప్ప కుటుంబ కథాచిత్రంగా ‘స్వాతిముత్యం’ అవార్డులతోపాటు అప్పటికి Box Office Records ని బ్రేక్ చెసింది. 1986,మార్చి 13 వ తేదీ విడుదలైన ఈ సినిమా భారతదేశం తరపున ఆస్కార్ ఎంట్రీని పొందింది. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం.

ఆనాడే ‘స్వాతిముత్యం’ (Swathi Mutyam) ఆస్కార్ (Oscar) ఎంట్రీతో పాటు ఏషియన్ పెసఫిక్ చిత్రొత్సవంలొ ఉత్తమ నటుడి అవార్డు , ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారంతో పాటు బంగారు నందిని కూడా అందుకుంది. దర్శకత్వ విభాగంలో ఫిల్మ్ ఫేర్ విజేతగా నిలిచింది, కమల్ హసన్ ఉత్తమనటుడుగా ఎంపికయ్యాడు. రష్యన్‌ భాషలోకి అనువదించి అక్కడ కూడా విజయవంతమైనది. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద ఏడిద నాగేశ్వరావు ఈ చిత్రాన్ని నిర్మించారు . సంప్రదాయం,సంచలనం,సంగీతం, సాహిత్యం రంగరించుకున్న ఈ చిత్రం తమిళం లో సిప్పిక్కుల్ ముత్తు. కన్నడలో స్వాతిముత్తు , హిందీలో ఈష్వర్ గా నిర్మాణమై దేశవ్యాప్తంగా సంచలన విజయాలను సొంతం చేసుకుంది.

ఆత్రేయ ,సినారె, సిరివెన్నెల గీతాలు ప్రేక్షకులను రసవృష్టిలో ముంచిముద్దచేశాయి. పసిడికి తావి అబ్బినట్లు ఆ కవుల కలం నుంచి జాలువారిన స్వర్ణాక్షరాలకు ఇళయరాజా రసరమ్యమైన సుస్వరాలతో పాటు అద్బుతమైన నేపద్య సంగీతం ఈ చిత్ర విజయానికి జత చేరాయి. అమాయకుడిగా కమల్ హాసన్ పాత్ర భారతీయ సినిమాల్లో చిరంజీవిగా నిలిచిపోయింది. రాధిక,నిర్మలమ్మ పోటీపడి నటించారు. గొల్లపూడి, శరత్ బాబు, ఏడిద శ్రీరాం, జెవి సోమయాజులు, దీప, వై.విజయ, మొదలైన నటీనటులు వాళ్ళ పాత్రలకు జీవం పోశారు. ఎమ్ వి రఘు ఛాయాగ్రహణం సహజత్వానికి అద్దం పట్టింది .ఏడిద రాజా (Swathi Mutyam) ఈ చిత్రానికి executive producer గా వ్యవహరించారు .ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కర్ణాటక లోని అనేక ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు.

Telegram Channel

Tags  

  • K. Vishwanath
  • Kamal Haasan
  • Oscars
  • Swathi Muthyam
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Allu Arjun: ఆస్కార్ పై స్పందించిన స్టైలిష్ స్టార్…ట్వీట్ వైరల్!

Allu Arjun: ఆస్కార్ పై స్పందించిన స్టైలిష్ స్టార్…ట్వీట్ వైరల్!

ఆస్కార్ సాధించటమనేది ప్రతి ఆర్టిస్ట్ కలగా ఉంటుంది. ఇక ఇండియన్ మూవీ ఆస్కార్ సాధించడం అనేది ఓ కల. ఆ కలను ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో రాజమౌళి నెరవేర్చాడు.

  • Deepika Padukone: ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో మెరిసిపోతున్న దీపికా పదుకొణే

    Deepika Padukone: ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో మెరిసిపోతున్న దీపికా పదుకొణే

  • Kamal Haasan: డీఎంకే కూటమి వైపు కమల్‌హాసన్‌ చూపు

    Kamal Haasan: డీఎంకే కూటమి వైపు కమల్‌హాసన్‌ చూపు

  • K. Viswanath’s Wife: కళతపస్వి విశ్వనాథ్ భార్య జయలక్ష్మీ కన్నుమూత

    K. Viswanath’s Wife: కళతపస్వి విశ్వనాథ్ భార్య జయలక్ష్మీ కన్నుమూత

  • K. Vishwanath: ముగిసిన కె. విశ్వనాథ్ అంత్యక్రియలు, కళాతపస్వికి ఇక సెలవు!

    K. Vishwanath: ముగిసిన కె. విశ్వనాథ్ అంత్యక్రియలు, కళాతపస్వికి ఇక సెలవు!

Latest News

  • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

  • WhatsApp: వాట్సాప్ డెస్క్ టాప్ లో సరికొత్త ఫీచర్స్.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే!

  • Ram Charan: సీఈఓ సినిమా నుంచి మరో లీక్.. సరికొత్త లుక్ లో రామ్ చరణ్?

  • Health Tips: రక్తపోటు, మధుమేహం, ఒక్కదెబ్బతో పారిపోతాయి.. ట్రైయ్ కరో!

  • Telangana: వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలో వడగండ్ల వర్షాలు?

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: