2024 Sankranti Movies : సంక్రాంతి విన్నర్ ఎవరో..?
- By Sudheer Published Date - 01:32 PM, Mon - 8 January 24
సంక్రాంతి (Sankranti ) పండగ అంటే చాలు తెలుగు ప్రజలకే కాదు సినీ లవర్స్ (Movie Lovers) కూడా పెద్ద పండగే. అగ్ర హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే నిర్మాతలు సైతం సంక్రాంతి బరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తుంటారు. ప్రతి ఏడాది అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న హీరోల చిత్రాలు. తమిళ్ డబ్బింగ్ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తూ తమ సత్తాను చాటుకుంటూ ఉంటాయి.
ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు కూడా బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కలయికలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే యంగ్ హీరో తేజ – ప్రశాంత్ వర్మ కలయికలో తెరకెక్కిన హనుమాన్ (Hanuman) చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండింటితో పాటు వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సైంధవ్ (Saindhav) మూవీ జనవరి 13 న , కింగ్ నాగార్జున – విజయ్ కలయికలో తెరకెక్కిన నా సామి రంగ (Naa Saami Ranga movie) సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏ చిత్రం పై చేయి సాధిస్తుందో చూడాలి.
ముందుగా గుంటూరు కారం విషయానికి వస్తే త్రివిక్రమ్ – మహేష్ బాబు కలయికలో అతడు (2005) సినిమా తెరకెక్కగా.. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ మహేష్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ గా నిలిచింది. అలాగే రెండోసారి వీరిద్దరి కలయికలో ఖలేజా మూవీ 2017 ప్రేక్షకుల ముందు వచ్చినప్పటికీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. కానీ బుల్లితెరపై ఈ సినిమా అత్యధిక టిఆర్పి రేటింగ్ తో సక్సెస్ సాధించింది. ఇప్పటికి ఈ సినిమా బుల్లితెరపై ప్రసరమైతే మంచి TRP రేటింగ్ సాధిస్తుంది. ఈ సినిమాలో మహేష్ పంచ్ డైలాగులు, అనుష్క గ్లామర్, కామెడీ ఇవన్నీ కూడా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మరోసారి మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడం తో గుంటూరు కారం పై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఆదివారం రిలీజ్ అయిన ట్రైలర్ చెప్పగానే చెప్పింది. ట్రైలర్లో మహేష్ మాస్ డైలాగులు చెప్పి అభిమానులను అలరించాడు. తమన్ బ్యాగ్రౌండ్.. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, శ్రీ లీల గ్లామర్, రామకృష్ణ ఎమోషన్, రావు రమేష్ , ప్రకాష్ రాజ్ , జగపతి ల రోల్స్ ఇవన్నీ కూడా సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇక అదే రోజున తేజ హీరోగా నటించిన హనుమాన్ మూవీ రిలీజ్ అవుతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిచిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాలో క్యాస్ట్ చిన్నగా ఉన్న సినిమా మాత్రం భారీ లెవల్లో ఉండబోతుందని ట్రైలర్ చెప్పగానే చెప్పింది. ఆదివారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరై సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. హనుమంత్ అనే యువకుడు పాత్రను హీరో తేజ పోషించారు. హనుమంతుడు వల్ల అతడు అతీత శక్తులు పొందినట్లు.. తమ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు వచ్చే విలన్లతో పోరాటడం చేస్తాడని ట్రైలర్ లో చూపించారు. ఈ చిత్రంలో తేజ సరసన అమృత హీరోయిన్ గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, గెటప్ శీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక జనవరి 13న వెంకటేష్ నటించిన సైంధవ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శైలేష్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేయగా వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా గట్టిగా ఉండబోతాయని వెంకటేష్ చెప్పుకొచ్చాడు. చాలామంది ఆడవాళ్లు ఈ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకుంటారని.. అంతలా ఎమోషన్ పండిందని, డైలాగ్స్ కూడా మాస్ ని ఆలోచించే విధంగా ఉన్నాయని ప్రమోషన్ కార్య క్రమంలో తెలిపారు. ఈ చిత్ర ట్రైలర్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
జనవరి 14 నాగార్జున నటించిన నా సామిరంగా మూవీ రిలీజ్ కాబోతుంది. నాగార్జున కు గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. దీంతో నా సామి రంగ సినిమాపై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. కొరియోగ్రాఫర్ గా తన సత్తా చాటుకున్న విజయ్ బిన్నీ ని డైరెక్టర్ గా ఎంచుకొని రంగంలోకి దిగాడు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు ముఖ్య పాత్రలు పోషించారు. కేవలం 90 రోజుల్లో ఈ సినిమా
షూటింగ్ పూర్తయింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు చిత్రాలు సంక్రాంతి పండుగకు రిలీజ్ అయి హిట్ కొట్టడంతో మరోసారి నాగార్జున ఖాతాలో హిట్ గ్యారెంటీ అనే అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. మొత్తంగా సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ నాల్గు సినిమాల ఫై అభిమానుల్లో , సినీ ప్రేక్షకుల్లో అలాగే చిత్ర సీమా లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో..? ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో..? ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించగలదో చూడాలి.
Read Also : Shakib Al Hasan: అభిమాని చెంప చెల్లుమనిపించిన షకిబ్
Related News
Mirai Manchu Manoj : మిరాయ్ నుంచి మంచు హీరో లుక్.. ప్రీ లుక్ పోస్టర్ షేక్ అయ్యేలా ఉంటే..!
Mirai Manchu Manoj హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజా సజ్జా లీడ్ రోల్ లో ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా మిరాయ్.