Nisha Noor : స్టార్ హీరోల సినిమాల్లో నటించిన హీరోయిన్.. వ్యభిచార వృత్తిలోకి దిగి ఎయిడ్స్‌తో మరణం..
1980 నుంచి 1986 వరకు హీరోయిన్ గా స్టార్ స్టేటస్ రాణించిన నటి 'నిషా నూర్'(Nisha Noor).
- Author : News Desk
Date : 14-07-2023 - 7:31 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ ప్రపంచంలో ఎంతోమంది తారలు ఒక వెలుగు వెలుగుతారు. కానీ కొంతంది స్టార్స్ మాత్రం ఆ వెలుగుని చివరి దాకా వారితో తీసుకు వెళ్ళలేరు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ కెరీర్ మధ్యలోనే కనుమరుగు అయ్యిపోయింది. 1980 నుంచి 1986 వరకు హీరోయిన్ గా స్టార్ స్టేటస్ రాణించిన నటి ‘నిషా నూర్'(Nisha Noor). కమల్ హాసన్, రజనీకాంత్, రాజేంద్రప్రసాద్, మోహన్‌లాల్.. వంటి స్టార్ హీరోల సినిమాలో నటించడమే కాకుండా బాలచంద్రన్, భారతీరాజా, చంద్రశేఖర్, విసు.. వంటి గొప్ప దర్శకుల సినిమాల్లో కూడా కనిపించింది.
అయితే 1995 తర్వాత నూర్‌కు ఒక సినిమా ఛాన్స్ కూడా రాలేదు. దీంతో ఆమె సినిమా రంగాన్ని వదిలేసింది. ఇక సంపాదన లేకపోవడంతో ఉన్న ఆస్తులు కూడా కరిగిపోసాగాయి. అయితే బ్రతకడానికి ఏదొక పని చేయాలిగా.. ఈ క్రమంలోనే నూర్ తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. వ్యభిచార వృత్తిలోకి దిగింది. అయితే ఆమె అటువైపుగా అడుగులు వేయడానికి గల కారణం ఒక ప్రముఖ నిర్మాత బలవంతమే అంటూ అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నూర్ పరిస్థితి తెలిసినా సినీ పరిశ్రమ నుంచి ఎవరు ఆదుకోకపోవడంతో ఆమె వ్యభిచార వృత్తిలోనే కొనసాగింది.
దీంతో ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. తినడానికి తిండి, ఉంటాకి ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఒకసారి ఓ దర్గా వెలుపల నిద్రిస్తూ కన్పించింది. ఇక ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఓ తమిళ ఎన్జీవో నూర్ కి సహాయం చేసందుకు ముందుకు వచ్చారు. అయితే అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. గుర్తుపట్టలేనంత స్థితిలో ఆమె బాగా బక్కచిక్కి పోయింది. ఇక ఆమెకు వైద్య పరీక్షలు చేయించగా ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. ఆ రోగంతో పోరాడుతూ ఆస్పత్రిలో అనాధగా 2007లో కన్నుమూసింది. ఒక స్టార్ హీరోయిన్ జీవితం చివరిదశలో ఎవరూ తోడు లేక అలా మరణించడం చాలా బాధాకరం.
Also Read : Officer Max : హిట్ 2 చిత్రంలోని ఆఫీసర్ మ్యాక్స్ ఆకస్మిక మరణం