TX Hospitals : అరుదైన ప్రెగ్నెన్సీ కేసు – తల్లి,కవలల ప్రాణాలు కాపాడిన వైద్యులు
TX Hospitals : ప్లసెంటా పెర్క్రేటా, బ్లాడర్ ఇన్వేజన్ , ట్విన్ ప్రెగ్నెన్సీ కలగలిపిన అత్యంత సంక్లిష్టమైన కేసును విజయవంతంగా నిర్వహించారు
- By Sudheer Published Date - 09:08 PM, Thu - 3 July 25

అరుదైన గర్భధారణ కేసులో తల్లి, ఇద్దరు శిశువుల ప్రాణాలను బంజారాహిల్స్ TX హాస్పిటల్స్ వైద్యులు కాపాడారు. ప్లసెంటా పెర్క్రేటా, బ్లాడర్ ఇన్వేజన్ , ట్విన్ ప్రెగ్నెన్సీ కలగలిపిన అత్యంత సంక్లిష్టమైన కేసును విజయవంతంగా నిర్వహించారు. అత్యంత అరుదైన ఈ ప్రాణాంతక గర్భధారణ సమస్యను విజయవంతంగా నిర్వహించి ఒక తల్లి , ఆమె ఇద్దరు శిశువుల ప్రాణాలను కాపాడారు. జహీరాబాద్ కు చెందిన ఆయేషా సిద్ధికా గారు అనే గర్భిణీ తరచూ రక్తస్రావంతో బాధపడుతూ TX Hospitals లో చేరారు. గతంలో ఆమెకు రెండు సిజేరియన్ డెలివరీలు , గర్భాశయంపై సర్జరీ జరగడంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా గ్రేడ్ IV ప్లసెంటా ప్రీవియా , ప్లసెంటా పెర్క్రేటాగా నిర్థారించారు. ప్లసెంటా పూర్తిగా గర్భాశయాన్ని కవర్ చేస్తూ మూత్రాశయం లోపలకి కూడా ప్రవేశించింది.
Telangan BJP : టీబీజేపీ అధ్యక్షునిగా ఎల్లుండి రామచందర్‌రావు బాధ్యతలు
ట్విన్ ప్రెగ్నెన్సీ , ప్లసెంటా పెర్క్రేటా , బ్లాడర్ ఇన్వేజన్ కలిపిన ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 50 వేల గర్భధారణల్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సర్జరీ చేసేటప్పుడు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకుంటే తల్లీ,పిల్లల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో TX హాస్పిటల్స్ వైద్యబృందం డాక్టర్ . అవినాష్ దాల్ , డాక్టర్ శృతి పలకొళ్ల , డాక్టర్ సుధ ఎస్, డాక్టర్ ఏడుకొండలు , డాక్టర్ సందీప్ తో పాటు తో పాటు మిగిలిన వైద్యులు విజయవంతంగా సర్జరీ చేసి తల్లీ, ఇద్దరు కవలల ప్రాణాలు కాపాడారు. పలు హాస్పిటల్స్ కు వెళ్ళినా రిస్క్ ఎక్కువగా ఉండడంతో ఎవ్వరూ చేర్చుకోలేదని ఆయేషా సిద్ధికా భర్త తెలిపారు. కానీ TX హాస్పిటల్స్ వైద్యబృందం తమకు ధైర్యం చెప్పి సర్జరీ చేసారని సంతోషంగా వ్యక్తం చేశారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్ లో ప్రతీ నిమిషం ఎంతో కీలకమని, తమ డాక్టర్స్ టీమ్ ఎంతో శ్రమించి సక్సెస్ చేశారని TX హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ వొడ్నాల తెలిపారు. TX హాస్పిటల్స్ మేనేజ్ మెంట్ కు పేషెంట్ కుటుంబసభ్యులు ధనవ్యాదాలు తెలిపారు.