Donald Trump : ట్రంప్ ఒక్క డైలాగ్ తో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్
Donald Trump : ట్రేడింగ్ ప్రారంభం నుంచి సెన్సెక్స్ 1100 పాయింట్ల లాభంతో దూసుకెళ్లింది. మధ్యాహ్నం నాటికి ఈ లాభాలు మరింతగా పెరిగి 1500 పాయింట్లకు చేరుకున్నాయి
- By Sudheer Published Date - 01:31 PM, Tue - 8 April 25

నిన్న ఏప్రిల్ 7న స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ (Sensex) ఒక్కరోజులోనే 3900 పాయింట్లకుపైగా పడిపోయి, మార్కెట్‌లో బ్లడ్‌బాత్ చూపించింది. అయితే ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి సెన్సెక్స్ 1100 పాయింట్ల లాభంతో దూసుకెళ్లింది. మధ్యాహ్నం నాటికి ఈ లాభాలు మరింతగా పెరిగి 1500 పాయింట్లకు చేరుకున్నాయి. నిఫ్టీ కూడా 470 పాయింట్ల లాభంతో 22,630 స్థాయిలో ట్రేడవుతోంది. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో రూ. 8 లక్షల కోట్లకుపైగా పెరగడం విశేషం.
Hair Tips: తలకు నూనె రాస్తున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే బట్టతల రమ్మన్నా రాదు!
ఈ భారీ రికవరీకి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన వ్యాఖ్యలే. కొన్ని దేశాలు సుంకాలపై చర్చకు ముందుకొస్తున్నాయని ఆయన ప్రకటించడంతో, వాణిజ్య యుద్ధ భయాలు తగ్గిపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా కొంత తగ్గిన నేపథ్యంలో మార్కెట్‌లో పాజిటివ్ సెంటిమెంట్ పెరిగింది. రిలయన్స్, హెచ్‌డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి దిగ్గజ స్టాక్స్‌తో పాటు మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా మంచి లాభాలను నమోదు చేశాయి.
ఇతర ఆసియా మార్కెట్లు కూడా ఇవే ధోరణిని చూపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.93%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.14% లాభపడటంతో మార్కెట్ వృద్ధికి ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో మొత్తం 2,618 స్టాక్స్ లాభాల్లో కొనసాగగా, కేవలం 410 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ముగిశాయి. దేశీయ పెట్టుబడిదారులు రూ. 12,122 కోట్ల విలువైన స్టాక్స్ కొనడం కూడా మార్కెట్‌కి బలాన్నిచ్చింది. ట్రంప్ ప్రకటనలతో వచ్చిన ఈ ఉత్సాహం, మార్కెట్‌కి తాత్కాలిక ఊపునిచ్చినప్పటికీ దీర్ఘకాలానికి దీని ప్రభావాన్ని గమనించాల్సి ఉంటుంది.