HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Business
  • >Lg Released New Xboom Series With Brand New Sound

LG XBOOM Series : సరికొత్త సౌండ్ తో కొత్త XBOOM సీరీస్ ను విడుదల చేసిన LG

  • By Sudheer Published Date - 03:42 PM, Fri - 15 November 24
  • daily-hunt
Lg Xboom
Lg Xboom

భారతదేశపు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ లో ఒకటి LG ఎలక్ట్రానిక్స్. తన ఆడియో శ్రేణికి సరికొత్త చేరికలను, LG XBOOM సీరీస్ ను ఈ రోజు విడుదల చేసింది. XG2T, XL9T, మరియు XO2T మోడల్స్ దీనిలో ఉన్నాయి. మెరుగైన సౌండ్ నాణ్యత, మెరుగుపరచబడిన పోర్టబిలిటి, లైటింగ్ ఫీచర్లతో ఆడియో అనుభవాన్ని పెంచడానికి ఈ కొత్త కలక్షన్ రూపొందించబడింది, దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల కోసం ఇండోర్ మరియు అవుట్ డోర్ సెట్టింగ్స్ రెండిటిని అందిస్తుంది.

తమ కొత్త XBOOM సీరీస్ తో, LG ఎలక్ట్రోనిక్స్ ఆడియో వినూత్నత కోసం కొనసాగుతోంది, వివిధ రకాల మ్యూజిక్ అనుభవాల శ్రేణికి తగినట్లుగా శక్తివంతమైన సౌండ్, స్టైలిష్ డిజైన్ మరియు పోర్టబిలిటీలను కలిపే ప్రోడక్ట్స్ ను అందిస్తోంది. ప్రతి మోడల్ డైనమిక్ సౌండ్ అవుట్ పుట్ మరియు లీనయ్యే లైటింగ్ నుండి మన్నిక వరకు సామర్థ్యాలతో నిండింది మరియు XBOOM సీరీస్ ను కుటుంబ సమావేశాలు కావచ్చు, అవుట్ డోర్ సాహసాలు లేదా ఇంట్లోనే సాయంత్రాలు కోసం ఇలా అన్ని సందర్భాల కోసం ఎంపిక చేసుకునే ఆప్షన్ గా చేసింది.

“మా కొత్త XBOOM సీరీస్ విడుదలతో, LG టెక్నాలజీతో సౌకర్యాన్ని కలిపే ఆడియో ఉత్పత్తులను తీసుకువస్తోంది,” అని బ్రియాన్ యంగ్, డైరెక్టర్, హోమ్ ఎంటర్టైన్మెంట్ LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అన్నారు. “మా కస్టమర్లు సౌండ్ ను అనుభవించే విధానాన్ని మెరుగుపరచడానికి, శక్తివంతమైన ఆడియో, లైటింగ్ ఫీచర్లు మరియు మన్నికతో ప్రతి వాతావరణానికి అనుకూలంగా ఈ మోడల్స్ రూపొందించబడ్డాయి. మీరు ఉత్సాహవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నా, సాహసం చేయడానికి వెళ్తున్నా, లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా, XBOOM సీరీస్ మీ ఆడియో అనుభవాన్ని మెరుగుపరిచే ప్రోడక్ట్ ను అందిస్తోంది.”

LG XBOOM సీరీస్ యొక్క కీలకమైన ఫీచర్లు చూస్తే..

LG XBOOM XL9T అనగా పార్టీ స్పీకర్. అత్యధిక ప్రభావితమైన సౌండ్ అనుభవాల కోసం నిర్మించబడింది, డ్యూయల్ 8-అంగుళాల ఊఫర్లు మరియు 3-అంగుళాల ట్వీటర్ల ద్వారా 1000W అవుట్ పుట్ ను అందిస్తోంది. మంద్రమైన శృతి మెరుగుదల అల్గోరిథమ్ తో XL9T మంచి మ్యూజిక్ అనుభవం కోసం లోతైన, ప్రతిధ్వనించే సౌండ్ ను అందిస్తుంది.

ఇది ఊఫర్ లైటింగ్ తో పాటు కొత్త పిక్సెల్ LED ఫీచర్ ను కూడా కలిగి ఉంది. పార్టీలు మరియు సమావేశాల కోసం పరిపూర్ణమైన ఆకర్షణీయమైన, క్లబ్ – వంటి పరిసరాలను కల్పించే కొత్త టెక్ట్స్, కారక్టర్లు లేదా ఇమోజీలను ఎవరైనా సృష్టించవచ్చు / అనుకూలంగా చేయవచ్చు. దీని నీటి-నిరోధకత కలిగిన IPX4 రేటింగ్ తో, సౌకర్యవంతమైన హ్యాండిల్, బలమైన వీల్స్ తో, XL9T పోర్టబిలిటి మరియు నమ్మకాలను అందిస్తుంది, అవుట్ డోర్ కార్యక్రమాల కోసం ఉత్తమమైనది.

సౌండ్ నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా పోర్టబిలిటి కోసం LG XBOOM GO XG2T రూపొందించబడింది. ఈ పొందికైన 5W పవర్ హౌస్ కు 1.5 అంగుళాల ఊఫర్ మరియు పాసివ్ రేడియేటర్ లు ఉంటాయి, తన సైజ్ కోసం డైనమిక్, అత్యధిక ఒత్తిడి గల సౌండ్ ను కలిగించే మంద్రమైన అల్గొరిథమ్ తో మెరుగుపరచబడింది.

IP67 రేటింగ్ మరియు యుఎస్ మిలిటరి స్టాండర్డ్ మన్నికతో కఠినమైన పరిస్థితులను తట్టుకోవడానికి నిర్మితమైన, XG2T 10 గంటల వరకు ప్లేబ్యాక్ ను అందిస్తుంది, అవుట్ డోర్ సాహసాల కోసం పరిపూర్ణమైనది. దీని అనుకూలమైన స్ట్రింగ్ బ్యాక్ ప్యాక్స్, బైసైకిల్స్ , టెంట్లు మరియు మరిన్నింటి కోసం సులభంగా జత చేయడానికి అవకాశం ఇస్తుంది మరియు ప్రయాణంలో ఉత్తమమైన సహచరిగా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ స్మార్ట్ ఫోన్ ను బయటకు తీయకుండానే కాల్స్ చేయడానికి సహాయపడుతుంది.

LG XBOOM XO2T తన 360- డిగ్రీల ఆమ్నీడైరక్షనల్ 20W సౌండ్ తో స్టైల్ మరియు ఫంక్షనాలిటీని కలుపుతుంది, మెరుగైన మంద్రమైన శృతి మరియు స్పష్టమైన వాయిస్ నాణ్యతను అందిస్తుంది. సున్నితమైన, క్యాండిల్ –వంటి లైట్ ను వ్యాప్తి చేసే పారదర్శకమైన గ్లాస్ ప్రభావంతో మనోస్థితిని మెరుగుపరిచే లైటింగ్ ను సమీకృతం చేసి ఏ రకమైన ఏర్పాటులోనైనా సొగసైన పరిసరాలను కల్పిస్తుంది. XO2T యొక్క IP55 నీటి నిరోధకత మరియు 15+ గంటల బ్యాటరీ జీవిత కాలం అవుట్ డోర్ మరియు ఇండోర్ వాడకం కోసం దీనిని విలక్షణమైన ఎంపికను చేసింది.

బ్లూటూత్ 5.3, LG వన్ టచ్ మోడ్, మరియు మల్టి-పాయింట్ భాగస్వామం ఫీచర్లతో, ఇది నిరంతరంగా ఆడియో అనుభవాలను మెరుగుపరుస్తుంది. ఈ స్పీకర్లు LG TVతో సమన్వయం కలిగి ఉంటాయి మరియు అనుకూలమైన ఫ్రంట్ లేదా రియర్ పరిసర సెట్టింగ్స్ మరియు స్టీరియోతో పాటు ప్లే చేయబడతాయి. మీకు భిన్నమైన బ్రాండ్ టివి ఉన్నప్పటికీ XBOOM స్పీకర్లను మీ టివి/మొబైల్ డివైజ్ లకు కనక్ట్ చేయవచ్చు.

ధర మరియు లభ్యత చూస్తే..

LG XBOOM సీరీస్ భారతదేశంలో LG.com సహా రిటైల్ మరియు ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో 15 – నవంబర్-2024 నుండి కొనుగోలు చేయడానికి లభిస్తాయి. XG2T కోసం ధరలు రూ. 4,990, XO2T కోసం రూ. 12,990 మరియు XL9T కోసం రూ. 64,900 ప్రారంభమవుతాయి మరియు ఆయా మోడల్స్ ని బట్టి ఫీచర్లు మారవచ్చు.

Read Also : AP Assembly Sessions : జగన్ ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసాడు – సీఎం చంద్రబాబు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brand new sound
  • LG new XBOOM series
  • Lg new xboom series price
  • LG XBOOM
  • LG XBOOM Go

Related News

    Latest News

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd