HDFC Bank : బీ అలర్ట్.. ఆ 13 గంటలు బ్యాంకు సేవలు బంద్
మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు అకౌంట్ ఉందా ? అయితే బీ అలర్ట్.
- By Pasha Published Date - 03:03 PM, Wed - 3 July 24
![HDFC Bank : బీ అలర్ట్.. ఆ 13 గంటలు బ్యాంకు సేవలు బంద్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/10/hdfc-bank.jpg)
HDFC Bank : మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు అకౌంట్ ఉందా ? అయితే బీ అలర్ట్. ఈనెల 13న(శనివారం రోజు) ఆ బ్యాంక్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీంతో ఆ రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 13 గంటలకుపైనే హెచ్డీఎఫ్సీ బ్యాంకు(HDFC Bank) సేవలకు అంతరాయం ఏర్పడనుంది. రానున్న రోజుల్లో కస్టమర్లకు మరింత వేగవంతమైన సేవలను అందించేందుకే ఈ అప్‌గ్రేడ్ చేస్తున్నామని బ్యాంకు ప్రకటించింది. ఎవరికైనా ఆ రోజున అత్యవసర లావాదేవీలు ఉంటే.. కొంచెం ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని కోరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ను(CBS) కొత్త ఇంజనీరింగ్ ప్లాట్‌ఫామ్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పింది. ఈ తరుణంలో జులై 13న అందుబాటులో ఉండే హెచ్డీఎఫ్సీ బ్యాంకు సేవలు ఏమిటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- జులై 13న హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో నిర్ణీత పరిమితి మేరకు ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
- హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో స్వైప్ మెషీన్లపై పరిమిత స్థాయిలో లావాదేవీలు చేయొచ్చు. అయితే వీటికి సంబంధించిన మెసేజ్ అలర్ట్‌లు మాత్రం నెక్ట్స్ డే ఫోనుకు వస్తాయి.
- హెచ్డీఎఫ్సీ బ్యాంకు అకౌంటు నుంచి నిర్ణీత పరిమితిలో ఆన్లైన్ కొనుగోళ్లు చేయొచ్చు.
- శనివారం రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 3:45 గంటల వరకు, ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. మిగిలిన సమయాల్లో అంతరాయం ఉండదు.
- బ్యాంకు అకౌంటులోని బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ సెట్ చేసుకోవడం, మార్చుకోవడం అనేవి అందుబాటులో ఉంటాయి.
- హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఆ టైంలలో పనిచేయవు.
- డీమ్యాట్, కార్డ్‌లు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, వెల్తిఫై రిపోర్ట్స్ అందుబాటులో ఉంటాయి.
- ఈ బ్యాంకు కస్టమర్లు ఈనెల 12న (శుక్రవారం) రాత్రి 7:30 గంటల్లోపు అవసరమైన నగదును విత్‌డ్రా చేసుకుంటే బెటర్.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![HDFC Bank Service: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/10/hdfc-bank.jpg)
HDFC Bank Service: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్..!
HDFC Bank Service: మీకు HDFC బ్యాంక్ ఖాతా ఉంటే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. జూన్ 9, 16 తేదీల్లో బ్యాంక్ (HDFC Bank Service) చెల్లింపులతో సహా అనేక సేవలు మూసివేయబడతాయని సంస్థ పేర్కొంది. ఈ మేరకు బ్యాంకు తన ఖాతాదారులకు సందేశం కూడా పంపింది. ఈ సేవలు అర్థరాత్రి నుండి ఉదయం వరకు 4 గంటల పాటు మూసివేయబడతాయి. ఈ కాలంలో బ్యాంక్ నిర్వహణ షెడ్యూల్ ఉంటుంది. అంటే బ్యాంక్ తన […]