Amazon Lay Offs : కోట్లలో లాభాలు అయినప్పటికీ ఉద్యోగులను తొలగింపు..ఏంటి ఈ ఘోరం..?
Amazon Lay Offs : అక్టోబర్ 27న అమెజాన్ HR హెడ్ బెత్ గలెట్టి ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో, “కంపెనీని మరింత బలమైనదిగా, వేగంగా స్పందించగలిగేదిగా
- By Sudheer Published Date - 06:34 PM, Mon - 17 November 25
ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు మరోసారి తీవ్ర ఆందోళన సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ-కామర్స్ మహాకంపెనీ అమెజాన్, తన కార్పొరేట్ వర్గ ఉద్యోగుల్లో 4 శాతం అంటే సుమారు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కంపెనీ తాజా క్వార్టర్‌లోనే 18 బిలియన్ డాలర్ల లాభం సాధించింది. లాభాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులను తొలగించడం వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి, భయాందోళనలు పెరిగాయి. భారతదేశంలో కూడా సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశముండటంతో ఇండియన్ టెక్ సెక్టార్‌లో షాక్ వేవ్స్ పుట్టాయి. హాలిడే సీజన్ ముగిసిన అనంతరం 2026 జనవరిలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండొచ్చని వార్తలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
Delhi Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. మరో కొత్త విషయం వెలుగులోకి!
అక్టోబర్ 27న అమెజాన్ HR హెడ్ బెత్ గలెట్టి ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో, “కంపెనీని మరింత బలమైనదిగా, వేగంగా స్పందించగలిగేదిగా, కస్టమర్-సెంట్రిక్‌గా మార్చడం కోసం బ్యూరోక్రసీ తగ్గించాల్సి ఉందని” పేర్కొన్నారు. ఈ కారణంగా సంస్థలోని ఫైనాన్స్, మార్కెటింగ్, HR, టెక్నాలజీ, గ్లోబల్ ఆపరేషన్స్ టీమ్‌లు తీవ్ర ప్రభావం పొందుతున్నాయి. AWS, ప్రైమ్ వీడియో, ట్విచ్ వంటి ప్రధాన విభాగాల్లో కూడా లేయాఫ్‌లు జరగనుండడం గమనార్హం. ఇప్పటికే 2022–2023 మధ్య 27,000 మందిని తొలగించిన అమెజాన్, ఇప్పుడు రెండో పెద్ద ఉద్యోగ కోతకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో కంపెనీ Q2 2025లో 167 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించగా, AI డేటా సెంటర్లు మరియు జనరేటివ్ AI టూల్స్ కోసం 120 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు ప్రకటించింది.
Delhi Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. మరో కొత్త విషయం వెలుగులోకి!
ఈ ఉద్యోగ కోతల వెనుక ముఖ్య కారణం AI ఆటోమేషన్ అని కంపెనీ స్పష్టంగా వెల్లడిస్తోంది. ఉద్యోగులు మంచి పనితీరు చూపినా, టార్గెట్లు దాటినా AI టూల్స్ వల్ల వారి రోల్స్ ‘రెడండెంట్’ కావడంతో వారికి ఈమెయిల్ ద్వారా తొలగింపు నోటీసులు అందుతున్నాయి. ఇది ఉద్యోగుల్లో మరింత భయాన్ని సృష్టిస్తోంది. అమెజాన్ వర్కర్స్ యూనియన్ (AWU) “18 బిలియన్ డాలర్ల లాభంలో ఉన్న కంపెనీ 14,000 మందిని తొలగించడం టెక్ వరల్డ్‌లో అస్థిరతను పెంచుతోంది” అంటూ తీవ్రస్థాయిలో స్పందించింది. AI స్కిల్స్ లేని ఉద్యోగులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారనే అభిప్రాయం బలపడి, భవిష్యత్తులో టెక్ ఉద్యోగ మార్కెట్ AI ఆధిపత్యంలో పెద్ద మార్పులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.