Donkey Milk : గాడిద పాలతో ప్రతినెలా లక్షలు సంపాదిస్తున్న యువకుడు
Donkey Milk : అతడు గాడిదలు కాస్తున్నాడు. అయినా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల రేంజులో సంపాదిస్తున్నాడు.
- By Pasha Published Date - 04:00 PM, Sun - 21 April 24

Donkey Milk : అతడు గాడిదలు కాస్తున్నాడు. అయినా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల రేంజులో సంపాదిస్తున్నాడు. ప్రతినెలా దాదాపు రూ.3 లక్షల దాకా మిగుల్చుకుంటున్నాడు. ఔనా.. గాడిదలు కాస్తే ఇంత సంపాదన వస్తుందా ? అనే సందేహం మీ మైండ్‌లో వచ్చిందా ? నిజమే.. ఈవిషయాన్ని నిరూపించాడు గుజరాత్‌కు చెందిన ధీరేణ్ సోలంకీ. పూర్తి విశేషాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ధీరేణ్ ఎంత ట్రై చేసినా గవర్నమెంట్ జాబ్ రాలేదు. దీంతో కొంతకాలం ప్రైవేటు కంపెనీల్లో పనిచేశాడు. అయినా సంపాదన సరిపోక ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో కొత్తకొత్త స్వయం ఉపాధి అవకాశాలపై రీసెర్చ్ చేశాడు. ఇలాంటి ప్రయత్నంలోనే అతడికి గాడిదల పెంపకం(Donkey Milk)ఐడియా తట్టింది. 8 నెలల కిందటే 20 గాడిదలతో సొంత ఊర్లో గాడిదల ఫామ్ షురూ చేశాడు. ఇందుకోసం రూ.20 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ఆ గాడిదల సంఖ్య 42కు పెరిగింది. గాడిద పాలను లీటర్‌కు రూ.5,000 ధరలకు సోలంకీ అమ్ముతున్నాడు. ఈ పాలను ఫ్రీజర్లలో నిల్వ చేసి మరీ కస్టమర్లకు సప్లై చేస్తున్నాడు. ఈ పాలను వీటిని పొడిగా చేసి కూడా విక్రయిస్తున్నాడు. ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాడు. ఈ బిజినెస్‌పై ఇప్పటిదాకా దాదాపు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ప్రతినెలా దాదాపు రూ.3 లక్షల ఆదాయం వస్తోందని ధీరేణ్ సోలంకీ చెబుతున్నాడు. మొదటి ఐదు నెలల పాటు పెద్దగా ఆదాయం రాలేదని.. ఆ తర్వాతే ఆర్డర్లు పెరిగాయన్నారు.
Also Read :Majlis In Bihar : బిహార్‌లో ‘మజ్లిస్’ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తున్న స్థానాలివే..
గుజరాత్‌లోని తన గాడిదల ఫామ్ నుంచి కర్ణాటక, కేరళకు ఈ పాలను సప్లై చేస్తున్నట్లు ధీరేణ్ వెల్లడించాడు. సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు కూడా గాడిద పాల కోసం తనకు ఆర్డర్లు ఇస్తున్నాయని ఆయన చెప్పాడు. గాడిద పాలతో ఫెయిర్‌నెస్ క్రీమ్, షాంపూ, లిప్‌బామ్, బాడీవాష్ వంటి కాస్మెటిక్స్ తయారుచేస్తుంటారు. నిద్రలేమి, ఎసిడిటీలతోపాటు ఎగ్జిమా, సిఫిలిస్, స్కేబిస్, దురద, తామర, వైరల్ జ్వరాలు, ఆస్తమా వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచి ఔషధమని నమ్ముతారు.