మీరు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే ఆ ప్రచారాలను అస్సలు నమ్మకండి – RBI
ముఖ్యంగా "డౌన్ పేమెంట్ లేకుండా 100% బ్యాంక్ లోన్‌తో ఇల్లు కొనుగోలు చేయవచ్చు" అనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. ఏ బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కూడా ఆస్తి విలువలో పూర్తి మొత్తాన్ని రుణంగా మంజూరు
- Author : Sudheer
Date : 22-01-2026 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల, కానీ ఈ కలను ఆసరాగా చేసుకుని వచ్చే కొన్ని ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ముఖ్యంగా “డౌన్ పేమెంట్ లేకుండా 100% బ్యాంక్ లోన్‌తో ఇల్లు కొనుగోలు చేయవచ్చు” అనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. ఏ బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కూడా ఆస్తి విలువలో పూర్తి మొత్తాన్ని రుణంగా మంజూరు చేయడానికి వీలులేదు. ఇంటి కొనుగోలుదారుడు తన సొంత పొదుపు నుండి కనీసం కొంత మొత్తాన్ని ‘మార్జిన్ మనీ’ లేదా ‘డౌన్ పేమెంట్’ రూపంలో తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

Homeloan
రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన LTV (Loan to Value Ratio) నిబంధనల ప్రకారం, ప్రాపర్టీ విలువను బట్టి లోన్ పరిమితులు మారుతూ ఉంటాయి. రూ. 30 లక్షల వరకు విలువైన ఇళ్లకు గరిష్టంగా 90% వరకు లోన్ లభిస్తుంది. రూ. 30 లక్షల నుండి రూ. 75 లక్షల మధ్య విలువైన ప్రాపర్టీలకు 80% వరకు మాత్రమే రుణం ఇస్తారు. రూ. 75 లక్షల కంటే ఎక్కువ విలువైన ఖరీదైన ఇళ్లకు కేవలం 75% వరకు మాత్రమే బ్యాంకులు ఫైనాన్స్ చేస్తాయి. మిగిలిన 10% నుండి 25% మొత్తాన్ని కొనుగోలుదారుడే భరించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకులపై రుణ భారాన్ని తగ్గించడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకున్న నిర్ణయం.
అంతేకాకుండా, బ్యాంకులు కేవలం రిజిస్ట్రేషన్ విలువ లేదా మార్కెట్ విలువలో తక్కువగా ఉన్న దానినే పరిగణనలోకి తీసుకుంటాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ మరియు ఇతర ఇతర ఖర్చులను బ్యాంకులు ఇచ్చే హోమ్ లోన్ కవర్ చేయదు; వీటిని కూడా కొనుగోలుదారుడే స్వయంగా చెల్లించాలి. కాబట్టి, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇల్లు వస్తుందనే ప్రకటనలను నమ్మి మోసపోకుండా, ముందే తగినంత ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం ఉత్తమం. లోన్ తీసుకునే ముందు మీ సిబిల్ స్కోర్ మరియు నెలవారీ ఆదాయాన్ని బట్టి బ్యాంకులు మీకు ఎంత రుణం ఇస్తాయో ముందే లెక్కించుకోవడం అవసరం.