Gold Jewellery: బంగారు నగలు అమ్మినా.. తాకట్టు పెట్టినా.. ఇవి తెలుసుకోండి
బంగారు ఆభరణాలను(Gold Jewellery) జాగ్రత్తగా వాాడాలి. లేదంటే వాటిపై గీతలు పడతాయి.
- By Pasha Published Date - 10:57 AM, Fri - 21 March 25

Gold Jewellery : బంగారం రేటు రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.90,623గా ఉంది. 22 క్యారెట్ల నగల బంగారం రేటు 10 గ్రాములకు రూ.83,083గా ఉంది. బంగారం ధరలు పెరిగితే భారతీయులు అందరికీ బాధ కలుగుతుంటుంది. ఎందుకంటే మన దేశంలో ప్రతీ శుభకార్యానికి బంగారు నగలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఆర్థిక అవసరాలు, ఇతరత్రా అత్యవసరాలు వచ్చినప్పుడు కొంతమంది బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. ఇంకొందరు బంగారాన్ని అమ్మేస్తుంటారు. ఇలాంటప్పుడు మన దగ్గరున్న గోల్డ్‌కు మెరుగైన రేటు రావాలంటే ఏం చేయాలో చూద్దాం..
- బంగారు ఆభరణాలను(Gold Jewellery) జాగ్రత్తగా వాాడాలి. లేదంటే వాటిపై గీతలు పడతాయి.
- గీతలు పడిన బంగారు నగలను సేల్ చేసినా, తనఖా పెట్టినా తక్కువ మనీ ఇచ్చేందుకు వ్యాపారులు ట్రై చేస్తారు.
- బంగారానికి నీరు తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు, చెమట తగిలితే బంగారు నగల మెరుపు తగ్గుతుంది. దీనికి కారణం నీటిలోని కొన్ని ఖనిజాలు. అవి బంగారానికి సిమెంటులా పట్టేస్తాయి.
- స్విమ్మింగ్, ఎక్సర్ సైజ్ వంటివి చేసేటప్పుడు గోల్డ్ చైన్లు, ఉంగురాలు తీసేయాలి. లేదంటే నీటిలో తడిసి వాటి మెరుపు తగ్గుతుంది.
- బంగారు నగలను వాడనప్పుడు గాలి తగలని బాక్సుల్లో ఉంచాలి.
- ఒక నగను, ఇతర నగలతో కలిపి ఉంచొద్దు. విడివిడిగా ఉంచాలి. లేదంటే గీతలు పడతాయి.
- నగలు ధరించాక వాటిని మెత్తని గుడ్డతోనే తుడవాలి.
- కొంతమంది చీర లేదా ఇతర డ్రెస్సులతో బంగారు ఆభరణాలను తుడుస్తారు. అలా చేయొద్దు.
- బంగారు నగలపై బాడీ స్ప్రే పడితే.. వాటి మెరుపు తగ్గుతుంది. ఫలితంగా రీ సేల్ వాల్యూ తగ్గుతుంది.
Also Read :Phone Connections: జనాభా కంటే ఫోన్ కనెక్షన్లే ఎక్కువే.. ‘ల్యాండ్‌లైన్’ పతనం
ఇవి గుర్తుంచుకోండి..
బంగారాన్ని శరీరం నుంచి తీసి డైరెక్టుగా అమ్మేయకండి. వాటిని రాత్రి టైంలో సర్ఫ్ నీటిలో నానబెట్టి, మరుసటి రోజు తెల్లవారి మంచినీటితో కడగండి. వాటిని మెత్తటి గుడ్డతో తుడవండి. దీంతో ఆ నగలు కొత్తవాటిలా మెరుస్తాయి. ఆ తర్వాతే వాటిని అమ్మాలి.