Car Tyres : సమ్మర్‌లో కారు టైర్లు పేలే రిస్క్.. సమస్యకు చెక్ ఇలా
Car Tyres : ఎండా కాలంలో కారు టైర్లు పేలే ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి.
- By Pasha Published Date - 04:21 PM, Wed - 28 February 24

Car Tyres : ఎండా కాలంలో కారు టైర్లు పేలే ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి. కొంతమంది కారును బాగానే మెయింటైన్ చేసినా టైర్లు మాత్రం పేలుతుంటాయి. అయితే వెహికిల్ కండీషన్‌ను పట్టించుకోకుండా వాడేయడం వల్ల ఇలా జరుగుతుంటుంది. రోడ్లపై స్పీడ్‌గా ప్రయాణించేటప్పుడు కారు టైర్లు ఒత్తిడికి గురై పేలిపోయే రిస్క్ ఉంటుంది. ఇంతకీ కారు టైర్లు ఎందుకు పేలుతాయి? టైర్ పేలినప్పుడు కారును ఏ విధంగా కంట్రోల్ చేయాలి ? అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
We’re now on WhatsApp. Click to Join
కారు టైర్లలో (Car Tyres) గాలి తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా ఇబ్బందే. గాలి ఒత్తిడి కూడా టైర్ పేలిపోయే రిస్కును పెంచుతుంది. యూజర్ మాన్యువల్ బుక్‌లో సూచించిన విధంగా టైర్లలో గాలిని నింపి మెయింటైన్ చేయాలి. టైర్లలో గాలి పీడనం ఎక్కువైతే పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పెద్ద గుంతులలోకి కారు టైర్లు దిగినప్పుడు కూడా బ్లాస్ట్ అవుతుంటాయి. టైర్లు బాగా అరిగిపోయి.. వాటిలోకి ఏవైనా రాళ్లు దిగినప్పుడు కూడా పేలుతాయి. టైర్లు పేలకూడదు అంటే.. ప్రతీ వారం టైర్లలో గాలి సరిగా ఉందో లేదో చెక్ చేయండి.
Also Read : Space Port : దేశంలో రెండో అంతరిక్ష కేంద్రం విశేషాలివీ..
డ్రైవింగ్ చేస్తుండగా కార్ టైర్ పేలితే చాలా అలర్ట్‌గా ఉండాలి. వెంటనే వెహికల్‌ను ఆపేయాలి. టైరు పేలగానే ఒకే వైపు స్టీరింగ్ తిరుగుతుంది. కారు బరువంతా ఒకే వైపునకు వచ్చేస్తుంది. స్టీరింగ్‌ను కంట్రోల్‌లో పెట్టుకొని ఇతర వాహనాలను ఢీ కొట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. కారు వేగాన్ని మెల్లిగా తగ్గిస్తూ ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. వెనక నుంచి వస్తున్న వాహనాలకు సిగ్నల్‌గా హజర్డ్ లైట్‌ను ఆన్ చేయాలి. ఇలాంటి పరిస్థితిలో సడన్ బ్రేక్ వేయకపోవడం బెటర్.
Also Read : Mahesh Babu: సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్ బాబు.. అలా ఎలా చేస్తారంటూ?
కారు టైర్‌పై సింబల్స్.. అర్థాలు తెలుసా ?
కారు టైర్ పై ‘S’ సింబల్ ఉంటే అది స్టాండర్డ్ అని అర్థం. ఈ గుర్తు ఉన్న టైర్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడపొచ్చు. కారు టైర్ పై ‘H’ సింబల్ ఉంటే అది హై స్పీడ్ అని అర్థం. ఈ గుర్తు ఉన్న టైర్లను గంటకు 230 కిలోమీటర్ల వేగంతో నడపొచ్చు. కారు టైర్ పై ‘V’ సింబల్ ఉంటే అది వెరీ హై స్పీడ్ అని అర్థం. ఈ గుర్తు ఉన్న టైర్లను గంటకు 230 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో కూడా నడపొచ్చు.