Volvo: వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో గురించి మనందరికి తెలిసిందే. వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్
- By Nakshatra Published Date - 05:44 PM, Sat - 12 November 22
ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో గురించి మనందరికి తెలిసిందే. వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ డెలివరీలను ప్రారంభించింది. కాగా ఈ ఏడాది జూలైలో ఎక్స్‌సి 40 రీఛార్జ్‌ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్ ఇండియాలో అత్యంత బడ్జెట్ లగ్జరీ ఎస్యూవి. భారత మార్కెట్ లో వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎక్స్ షోరూమ్ ధర సుమారుగా రూ.55.90 లక్షలు. అయితే భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేసిన మొదటి లగ్జరీ ఎస్యూవి. కర్ణాటక లోని బెంగళూరు సమీపం లోని హోస్కోట్ ప్లాంట్ లో దీనిని తయారు చేసారు. ఎక్స్‌సి 40 రీఛార్జ్ లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలలో కియా ఈవీ 6తో పోటీపడుతుంది.
స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో గుజరాత్‌లోని ఫస్ట్ కస్టమర్‌కి ఎలక్ట్రిక్ ఎస్యూవి మొదటి యూనిట్‌ను డెలివరీ చేసింది. కాగా ఈ కారు డెలివరీ సమయంలో వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ..ఈ డెలివరీ చారిత్రాత్మకమైనది. ఎందుకంటె 2030 నాటికి ఆల్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా మారే దిశగా మా ప్రయాణానికి నాంది పలుకుతుంది. అలాగే మా ప్రతిష్టాత్మకమైన ఆన్ లైన్ ప్రయాణం కూడా మొదటగా ప్రారంభించబడుతుంది. డైరెక్ట్ సేల్స్ మోడల్ క్రింద డెలివరీ చేయబడింది అని చెప్పుకొచ్చింది డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా.
అలాగే ఈ వోల్వో ప్రారంభించినప్పటి నుండి ఎక్స్‌సి 40 రీఛార్జ్ పై ప్రోత్సాహకరమైన రెస్పాన్స్ అందిదట. అలాగే ఇప్పటికే దాదాపు 500 ఆర్డర్లు వచ్చాయని ఆమె తెలిపింది. వోల్వో ఈ సంవత్సరం చివరిలోపు భారతీయ రోడ్ల పై దాదాపు 100 యూనిట్ లను ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ 150 యూనిట్లు రెండు గంటల్లోనే అమ్ముడయ్యాయట. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సరసమైన లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఇదే అని చెప్పవచ్చు. ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందదిన ఈ పెద్ద బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌పై 400 కి.మీల కంటే ఎక్కువ ప్రయాణించేల సహాయపడుతుంది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ దాని విభాగంలో అత్యంత వేగవంత మైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఈ కార్ కేవలం 4.9 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఈ వోల్వో కార్ ఎక్స్‌సి 40 రీఛార్జ్ టాప్ స్పీడ్ గంటకు 180 కి.మీ. ఎక్స్‌సి 40 రీఛార్జ్ బ్యాటరీ 8 సంవత్సరాల వారంటీ అలాగే 11kW సామర్థ్యం గల వాల్‌బాక్స్ ఛార్జర్ ను కలిగి ఉంది.
Related News
Xiaomi SU7 EV: ఈ కారు క్రేజ్ మామూలుగా లేదుగా.. లాంచ్ అయిన 30 నిమిషాల్లోనే 50 వేల బుకింగ్‌లు..!
ఇటీవలే Xiaomi తన మొదటి ఎలక్ట్రిక్ సెడాన్ కారు 'SU7'ని (Xiaomi SU7 EV) చైనాలో విడుదల చేసింది. దీని ధర 215,900 యువాన్ (సుమారు రూ. 24.92 లక్షలు) వద్ద ఉంచబడింది.