TVS Jupiter: టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కి సీఎన్జీ టెక్నాలజీ.. విడుదలయ్యేది అప్పుడే?
ప్రస్తుతం భారత మార్కెట్ లో పెట్రోల్ బైక్ లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ రెండు రకాల వాహనాలు ఒకదానితో ఒకటి పోటీపడి మరి రాణిస్తున్నాయి.
- By Anshu Published Date - 04:00 PM, Fri - 12 July 24

ప్రస్తుతం భారత మార్కెట్ లో పెట్రోల్ బైక్ లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ రెండు రకాల వాహనాలు ఒకదానితో ఒకటి పోటీపడి మరి రాణిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటికి పోటీగా సీఎన్‌జీ టెక్నాలజీ తో నడిచే స్కూటర్లను బైకులను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఆయా కంపెనీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ ఆటోమొబైల్ వాహన తయారీ సంస్థ టీవీఎస్ జూపిటర్ 120 సీసీ స్కూటర్ ను వీటికి పోటీగా తీసుకురానుంది.
అయితే ఇందులో యాక్టివా 125 సుజుకి యాక్సెస్ 125 లాంటి బైక్స్ మాత్రం లేవనే విషయాన్ని గుర్తించాలి. టీవీఎస్ జూపిటర్ 125 మోటార్ సైకిల్ సెగ్మెంట్ ఇటీవలే ఫస్ట్సీఎన్‌జీ మోడల్ బజాజ్ ఫ్రీడమ్ 125ను ప్రకటించింది. ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్ కూడా ఇదే అన్న విషయం తెలిసిందే. అయితే టీవీఎస్ సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలపై పనిచేస్తూ వస్తోంది. ఇప్పటికే సీఎన్‌జీ ఆప్షన్ అభివృద్ధి చేసింది. టీవీఎస్ జూపిటర్ 125కి సీఎన్‌జీ టెక్నాలజీని అందిస్తోంది. సీఎన్‌జీ స్కూటర్ ఉత్పత్తి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభం కావచ్చని నివేదికలో వెల్లడైంది. జూపిటర్ 125 సీఎన్‌జీ భారత మార్కెట్లో2024 చివరిలో లేదా 2025 మొదటిలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
టీవీఎస్ ప్రారంభంలో నెలకు 1,000 యూనిట్ల సీఎన్‌జీ స్కూటర్ లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, టీవీఎస్ జూపిటర్ 125 124.8సీసీ, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 8.2పీఎస్ గరిష్ట శక్తిని, 10.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ సీవీటీ ఆటోమేటిక్ తో వస్తోంది. వేరియంట్ వారీగా టీవీఎస్ జూపిటర్ 125 ధరలు కింది విధంగా ఉన్నాయి. డ్రమ్ అలోయ్ రూ. 79,299 కాగా
డిస్క్ రూ. 84,001 గా ఉంది. అలాగే స్మార్ట్ ఎక్స్‌నెక్ట్ రూ. 90,480 గా ఉండనుందట. ఇకపోతే ఇటీవలే, బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ మోటార్ సైకిల్‌ను రూ. 95వేల నుంచి రూ. 1.10 లక్షల ధర పరిధిలో ప్రవేశపెట్టింది. 124.58 సీసీ ఇంజన్ ద్వారా పవర్ పొందుతుంది. 9.5పీఎస్ గరిష్ట శక్తిని 9.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ మైలేజ్ సీఎన్‌జీ మోడ్‌లో 102కి.మీ/కేజీ, పెట్రోల్ మోడ్‌లో 65కి.మీ/లీటర్‌గా క్లెయిమ్ అయింది. సీఎన్‌జీ, పెట్రోల్ ట్యాంక్‌లు రెండింటి పూర్తి పరిధి 334కిలోమీటర్ల వద్ద వస్తుంది.