Car Tips: వర్షాకాలంలో మీ కారు ట్రబుల్ ఇవ్వకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవ్వడంతో పాటు రోడ్లమీదకి పెద్ద ఎత్
- By Nakshatra Published Date - 09:09 PM, Sat - 29 June 24
![Car Tips: వర్షాకాలంలో మీ కారు ట్రబుల్ ఇవ్వకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/MixCollage-29-Jun-2024-09-08-PM-8453.jpg)
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవ్వడంతో పాటు రోడ్లమీదకి పెద్ద ఎత్తున నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా వర్షాలు పడినప్పుడు వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో ఇలా వాహనాలు ఆగిపోతే ఊహించని ప్రమాదాలు జరగవచ్చు. అలాంటప్పుడు మనం కారు ట్రబుల్ ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో,ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారీ వర్షం కారణంగా నీట మునిగిన బేస్మెంట్ పార్కింగ్ ఉంటే, మీ కారు ఇంజిన్‌పై మీ మొదటి శ్రద్ధ అవసరం. వరదలు వంటి పరిస్థితులు కారు ఇంజిన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందువల్ల నీరు తగ్గిన వెంటనే ఇగ్నీషన్ ఆన్ చేయాలి. లేదా మెకానిక్‌ను పిలిచి ఎంత మేర నష్టం జరిగింది, అన్నది కచ్చితంగా తెలుసుకోవాలి. కారును స్టార్ట్ చేసే ప్రయత్నాలకు కూడా నీటి ప్రవాహం ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా చాలాసార్లు ఇంజిన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిసారు! కానీ అలా అస్సలు చేయకండి. ఒకవేళ చేస్తే సిలిండర్ వాల్, పిస్టన్, కనెక్టింగ్ రాడ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అదేవిధంగా కార్ టైర్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
అవి సరిగ్గా లేకపోతే బండి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదానికి దారి తీయవచ్చు. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా జరుగుతుంది. టైర్లను నిర్దిష్ట ప్రెజర్‌కు అనుగుణంగా ఉంచాలి. ట్రెడ్లను కూడా గమనించాలి. ఒకవేళ ట్రెడ్‌ల మధ్య ట్రెడ్ ఇండికేటర్లు కనిపిస్తే, యజమాని తప్పనిసరిగా టైర్లను మార్చాలి. సీజన్ ఏదైనా, కారులో బ్రేకుల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వర్షాకాలంలో దీని పట్ల ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి. అందువల్ల, బ్రేక్ ఫ్లూయిడ్‌ను సరైన స్థాయిలో ఉంచడానికి దానిని చెక్ చేయాలి.
బ్రేక్ ప్యాడ్లు, డిస్క్‌లను చెక్ చేయడం కోసం టెక్నీషియన్ని కూడా సంప్రదించాలి. ఒకవేళ ప్యాడ్ లు అరిగిపోయినట్లయితే వాటిని మార్చాల్సి ఉంటుంది. లైట్లు, ఇండికేటర్లను చెక్ చేయాలి. వాటర్ లాగింగ్ తరచుగా హెడ్లైట్లు, టెయిల్లైట్లు లేదా ఇండికేటర్లలో లోపాన్ని సృష్టిస్తుంది. తరచుగా కారు యజమానులు సరిగ్గా పనిచేసే హెడ్‌లైట్ లేదా ఇండికేటర్ లేకుండా తమ వాహనాలను నడుపుతూనే ఉంటారు. భారీ వర్షంలో ఇది చాలా ప్రమాదకరం! తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. అందువల్ల, హెడ్లైట్లు, టెయిల్లైట్లు, ఇండికేటర్ లు, హజార్డ్ లైట్లను ఎప్పటికప్పుడు చెక్ చేయండి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Car Mileage Tips: ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీ కారు మైలేజీ పెంచుకోండి ఇలా..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/safeimagekit-speed-for-mailege_11zon.jpg)
Car Mileage Tips: ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీ కారు మైలేజీ పెంచుకోండి ఇలా..!
Car Mileage Tips: మన వాడే కారు కొత్తదైన లేదా పాతదైన… మైలేజీ (Car Mileage Tips) గురించి ప్రశ్నలు అడుగుతుంటారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు కనిపించకపోవడమే కాదు, ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్లలో చిక్కుకోవడం వల్ల ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. అయితే ఇది ఒక్కటే తక్కువ మైలేజీకి కారణం కాదు… మీరు డ్రైవ్ చేసే విధానం కూడా మైలేజీపై మంచి, చెడు ప్రభావాన్ని చూపుతుంది. వాహనం స్పీడ్‌పై శ్రద్ధ పెడి