Low Seat Height Scooters: సీటు ఎత్తు తక్కువ ఉన్న స్కూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఇవి లుక్కేయండి?
ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగా స్కూటర్లకి ఉన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ స్కూటర్లు మహిళలు పురుషులకు అందరికీ కూడా కంఫర్టబుల్‌గా
- By Nakshatra Published Date - 03:00 PM, Wed - 31 January 24
ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగా స్కూటర్లకి ఉన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ స్కూటర్లు మహిళలు పురుషులకు అందరికీ కూడా కంఫర్టబుల్‌గా ఉంటున్నాయి. దీంతో స్కూటర్లు కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా లేడీస్ అయితే సీటు ఎత్తు తక్కువగా ఉన్న స్కూటర్లని ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది వినియోగదారులు తక్కువ సీటు ఎత్తు ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఎంచుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా ఈ స్కూటర్లు అన్ని రకాల రైడర్లు వినియోగిస్తుండటమే. ఈ స్కూటర్లు పురుషులతో పాటు, మహిళలకు సైతం సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ ను అందిస్తాయి. మీరు కూడా అలాంటి స్కూటర్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే ఒకసారి వీటిని పరిశీలించాల్సిందే…
టీవీఎస్ జెస్ట్ 110.. భారత్ లో అత్యంత సరసమైన ధరకు లభించే గేర్‌లెస్ స్కూటర్ లలో ఇది కూడా ఒకటి. ఈ బండి సీట్ ఎత్తు కేవలం 760ఎంఎం మాత్రమే. స్కూటీ జెస్ట్‌లో 109.7సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఎఫ్ఐ ఇంజిన్ 7.7 బీహెచ్పీ, 8.8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరి ఈటీవీఎస్ స్కూటర్ ధర విషయానికి వస్తే.. దీని ధర రూ. 73,036 ఎక్స్-షోరూమ్ గా ఉంది.
హీరో ప్లెజర్ ప్లస్.. అతి తక్కువ ధరకే లభిస్తున్న అద్భుతమైన స్కూటర్లలో ఇది కూడా ఒకటి. ఈ స్కూటర్ సీట్ ఎత్తు 765ఎంఎం మాత్రమే. దీని ధర రూ. 68,368 ఎక్స్-షోరూమ్ గా ఉంది. ఈ ప్లెజర్ ప్లస్ స్కూటర్లో 110.9సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. దీనిలోని మోటార్ 7.9 బీహెచ్పీ, 8.7 ఎన్ఎం గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది సీవీటీతో జత చేసి ఉంటుంది.
హోండా యాక్టివా 125.. మన దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న స్కూటర్. ఈ స్కూటర్ల సీట్ ఎత్తు 765 ఎంఎంగా ఉంది. స్టాండర్డ్ యాక్టివా ధర రూ. 75,347 కాగా, యాక్టివా 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 78,920 నుంచి ప్రారంభమవుతోంది. యాక్టివా 6జీ 109.51సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను 7.73 బీహెచ్పీ అభివృద్ధి చేస్తుంది. అయితే యాక్టివా 125 123.97సీసీ యూనిట్‌తో 8.19 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
టీవీఎస్ జూపిటర్ 125.. ఈ స్కూటర్ సీటు ఎత్తు 765ఎంఎం ఉంటుంది. జూపిటర్ ధర రూ. 71,390కాగా, జూపిటర్ 125 రూ. 82,825 ఎక్స్-షోరూమ్ ఉంటుంది. జూపిటర్‌లో 109.7సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.7 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే జూపిటర్ 125లో 124.8సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8 బీహెచ్పీ, సీవీటోతో జత చేసి ఉంటుంది.
హోండా గ్రాజియా 125.. ఈ స్కూటర్ ధర రూ. 82,520 ఎక్స్ షోరూం ఉంటుంది. దీని సీట్ ఎత్తు 765ఎంఎం ఉంటుంది. హోండా గ్రాజియాలో 123.97సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. 8.19 బీహెచ్పీ, 10.4ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
Related News
Smriti Irani: ఎన్నికల పాట్లు.. అర్ద రాత్రి స్కూటీపై కేంద్ర మంత్రి
అమేథీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమేథీ నియోజకవర్గంలో ఆమె రాత్రి స్కూటర్ నడుపుతూ ప్రజల మధ్యకు వెళ్లారు. అభ్యర్థి స్మృతి ఇరానీ స్కూటర్‌పై ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.