Tata cars: టాటా మోటార్స్ నుంచి 2024లో విడుదల కాబోతున్న కార్లు ఇవే.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్, వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుకొంది. ఈ టాటా వాహనాలకు మార్కెట్లో ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందర
- By Nakshatra Published Date - 02:50 PM, Sun - 24 December 23
ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్, వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుకొంది. ఈ టాటా వాహనాలకు మార్కెట్లో ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆటోమోటివ్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్‌కు స్పెషల్ క్రేజ్ ఉంది. భారత్‌లో తయారు చేసే టాటా కార్లు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయి. సేఫ్టీ విషయంలో కూడా కంపెనీ ఎక్కడ కూడ అస్సలు రాజీ పడదు. అయితే టాటా మోటార్స్ నుంచి ఇప్పటికే అనేక కార్లు మార్కెట్లోకి వచ్చి సక్సెస్ అయ్యాయి. కొత్త ఏడాది 2024లో సైతం కొన్ని మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి? వాటి ధర ఫీచర్ల విషయానికొస్తే..
టాటా హారియర్ ఈవీ..టాటా హారియర్ ఈవీని ఆటో ఎక్స్పో-2023లో ప్రొడక్షన్-రెడీ యూనిట్‌గా ప్రదర్శించారు. ఈ ఆల్ ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ ఈవీ 2024లో పండుగ సీజన్‌కు ముందు మార్కెట్లోకి రానుంది. నెక్సాన్ ఈవీ మాదిరిగానే, అదే డిజైన్‌లో రానుంది. డీజిల్-బేస్ట్ హారియర్ లాంటి బేస్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఎక్విప్మెంట్స్తో వెహికల్‌ను టాటా మోటార్స్ రూపొందిస్తోంది.
టాటా పంచ్ ఈవీ.. టాటా పంచ్ ఈవీ 2024 లో మార్కెట్లోకి విడుదల కానుంది. ఇది బ్లూ ఇన్సర్ట్స్, క్లోజ్డ్ గ్రిల్ వంటి ఈవీ-స్పెసిఫిక్ డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, LED హెడ్‌ల్యాంప్స్, సన్‌రూఫ్, ఫుల్-TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో పంచ్ ఈవీ బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అందించనుంది. దీని ధర రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉండవచ్చు.
టాటా కర్వ్.. ఇది కూపే డిజైన్‌తో వచ్చే ఒక కాంపాక్ట్ SUV. ఇది 2024 ఏప్రిల్‌లో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు ధర రూ.10.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 5 సీటర్ లేఅవుట్లో వెహికల్ రిలీజ్ కానుంది. ఇది నెక్సాన్, హారియర్ మధ్య లైనప్‌లో ఉంటుంది. కొత్త 1.2-లీటర్, 125 PS టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.5-లీటర్ డీజిల్, ఆల్-ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లలో వెహికల్ లాంచ్ అవుతుంది.
టాటా కర్వ్ ఈవీ.. టాటా కర్వ్ ఈవీ కొత్త నెక్సాన్ EV లాంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది. పెద్ద 12.3- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, టచ్-బేస్డ్ క్లైమేట్ కంట్రోల్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి ఫీచర్లు దీని సొంతం. ఈ వెహికల్ మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. 2024 మార్చిలో మార్కెట్లోకి రానున్న ఈ వెహికల్ ధర సుమారు రూ.20 లక్షలుగా ఉండనుంది.
Related News
Tata Tiago EV: ఈ కారు కొంటే రూ. 85 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.. ఫీచర్లు ఇవే..!
మీరు ఏప్రిల్ నెలలో కొత్త టాటా మోటార్స్ కారు (Tata Tiago EV)ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు చాలా మంచి అవకాశంగా నిరూపించవచ్చు.