E2GO రూ. 60 వేల ఎలక్ట్రిక్ స్కూటర్. రూ. 2 వేలకే సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఇండియాలో (India) ఎలక్ట్రిక్ స్కూటర్ల విప్లవం నడుస్తోంది. ఐతే... ఎన్ని స్కూటర్లు ఉన్నా..
- By Maheswara Rao Nadella Published Date - 10:00 AM, Sun - 19 February 23
పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో.. అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటున్నారు. ఈ క్రమంలో Odysse కంపెనీ రూపొందించిన E2go ఎలక్ట్రిక్ స్కూటర్ మైలేజ్ బాగుంది. ఒక కిలోమీటర్‌కి 28 పైసలు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌కి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. ఈ స్కూటర్ ఫీచర్స్ తెలుసుకుందాం.
స్కూటర్ ఫీచర్స్:
కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఇందులో 2 వేరియంట్లు ఉన్నాయి. అంటే.. స్కూటర్లు సేమ్.. బ్యాటరీలు మాత్రం వేరు. E2go Lead Acid ఎక్స్‌షోరూమ్ ధర రూ.59,750 కాగా E2go Lite – Lithium-ion ఎక్స్‌షోరూమ్ ధర రూ.71,100గా ఉంది. ఈ E2Go Lead Acid స్కూటర్ 60 కిలోమీటర్ల రేంజ్ కలిగివుంది. ఇది గంటకు అత్యధికంగా 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు 5 గంటలు పడుతుంది. దీని బరువు 90 కేజీలు. దీనికి USB చార్జింగ్ పాయింట్ కూడా ఉంది. E2Go Lite – Lithium-ion స్కూటర్ 70 కిలోమీటర్ల రేంజ్ కలిగివుంది. ఇది గంటకు అత్యధికంగా 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు 4 గంటలు పడుతుంది. దీని బరువు 90 కేజీలు. దీనికి కూడా USB చార్జింగ్ పాయింట్ కూడా ఉంది.
Odysse E2Go స్కూటర్ 5 కలర్స్‌లో లభిస్తోంది. అవి అజ్యూర్ బ్లూ, స్కార్లెట్ రెడ్, టీల్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్, మాటే బ్లాక్. ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంజిన్ పవర్ 250 వాట్స్ ఉంది. దీనికి 60V BLDC (వాటర్ ప్రూఫ్) ఎలక్ట్రిక్ మోటర్ ఉంది. Odysse E2Go ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంజిన్ పవర్ 250 వాట్స్ ఉంది. దీనికి 60V BLDC (వాటర్ ప్రూఫ్) ఎలక్ట్రిక్ మోటర్ ఉంది. ఈ స్కూటర్‌కి… ఆప్రాన్-మౌంటెడ్ హెడ్‌లైడ్, బాడీ-కలర్డ్ ఫ్రంట్ ఫెండెర్, అల్లాయ్ వీల్స్, పిల్లియన్ బ్యాక్‌రెస్ట్ ఉన్నాయి. ఇంకా.. రివర్స్ గేర్ ఫంక్షన్, 3 డ్రైవింగ్ మోడ్స్, డిజిటల్ స్పీడోమీటర్, యాంటీ-థెఫ్ట్ మోటర్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ వంటివి ఉన్నాయి.
ఈ స్కూటర్ లిథియం బ్యాటరీ చిన్నదే. దీనికి 3 ఏళ్ల వారంటీ ఉంది. మోటర్‌కి 1 సంవత్సరం వారంటీ ఉంది. గతుకుల్లో ఇబ్బంది లేకుండా వెళ్లేందుకు వీలుగా ఈ స్కూటర్‌కి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ రియర్ షాక్ ఉన్నాయి. ఈ స్కూటర్ని కంపెనీ వెబ్సైట్ (https://odysse.in)లో రూ.2000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
Also Read: Hero Splendor Plus Bike: బంపర్ ఆఫర్.. రూ.20 వేలకే Splendor Plus బైక్
Related News
Smriti Irani: ఎన్నికల పాట్లు.. అర్ద రాత్రి స్కూటీపై కేంద్ర మంత్రి
అమేథీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమేథీ నియోజకవర్గంలో ఆమె రాత్రి స్కూటర్ నడుపుతూ ప్రజల మధ్యకు వెళ్లారు. అభ్యర్థి స్మృతి ఇరానీ స్కూటర్‌పై ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.