Bullet 350 Next Gen: బుల్లెట్ లవర్స్‌కి శుభవార్త.. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి దూసుకొస్తున్న ‘నెక్స్ట్ జన్’ మోడల్.. పూర్తి వివరాలివే..
ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం మంది వినియోగదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను కొనుగోలు చేయడా
- By Anshu Published Date - 07:00 PM, Wed - 2 August 23

ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం మంది వినియోగదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అంతేకాకుండా మార్కెట్ లో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కీ భారీగా క్రేజ్ ఉంది. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైక్స్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది.
కాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్లోకి మరో కొత్త బైక్ విడుదల కాబోతోంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వస్తున్న బుల్లెట్ 350 నెక్స్ట్ జనరేషన్ మోడల్ ఆగస్టు 30 మార్కెట్‌లోకి రానుంది. 1932 నుంచి నిరంతర ఉత్పత్తిలో ఉన్న బుల్లెట్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి చెందిన పురాతన మోడల్ గా ఇది అందుబాటులోకి రానుంది. ఈ బైక్ డిజైన్ విషయానికి వస్తే..బుల్లెట్ 350 నెక్స్ట్ జనరేషన్ మోడల్‌కి చెందిన ఫోటోలు అధికారిక లాంచ్ కంటే ముందే లీక్ అయ్యాయి. వాటిని చూస్తే బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పు ఉండదని తెలుస్తోంది. ఈ బైక్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన క్లాసిక్ 350లో ఉన్నట్లుగానే బుల్లెట్ 350 నెక్స్ట్ జనరేషన్ లో కూడా టైల్‌లైట్, క్రోమ్ బెజెల్‌తో కూడిన ఫ్లాట్ రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉండవచ్చు.
బుల్లెట్ 250 నెక్స్ట్ జనరేషన్ 346 సీసీ UCE ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. ఇందులో కొత్త జే సిరీస్ ఇంజన్, 349 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటాయి. ఇకపోతే ఈ బైక్ ధర విషయానికి వస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ మోడల్ ధర రూ. 1 లక్షా 70 వేల నుంచి రూ. 1 లక్షా 90 వేల వరకు ఉండవచ్చని అంచనా. బుల్లెట్ ప్రేమికులు ఈ బైక్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..