TVS Apache RTR 160: సూపర్ ఫీచర్స్‌తో రేసర్ ఎడిషన్ లాంచ్ చేసిన అపాచీ?
యువత ఎక్కువ శాతం ఇష్టపడే బైక్స్ లో చేసిన బైక్స్ కూడా ఒకటి. ముఖ్యంగా అత్యాదునిక ఫీచర్స్ తో ఉన్న రేసింగ్ బైక్స్ ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అయితే తాజాగా అలాంటి వినియోగదారులకు ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. తమ కంపెనీకు చెందిన అ
- By Anshu Published Date - 11:30 AM, Sun - 14 July 24

యువత ఎక్కువ శాతం ఇష్టపడే బైక్స్ లో చేసిన బైక్స్ కూడా ఒకటి. ముఖ్యంగా అత్యాదునిక ఫీచర్స్ తో ఉన్న రేసింగ్ బైక్స్ ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అయితే తాజాగా అలాంటి వినియోగదారులకు ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. తమ కంపెనీకు చెందిన అపాచీ మోడల్ బైక్ కు రేసింగ్ ఎడిషన్ ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 2 వీ రేసింగ్ ఎడిషన్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ బైక్ ధర విషయానికి వస్తే.. రూ. 1,28,720 గా ఉంది. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ బైక్ షోరూమ్స్ వద్ద ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభించారు.
అలాగే అపాచీ ఆర్‌టీఆర్ 160కు సంబంధించిన డ్యూయల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,27,220 గా ఉంది. ముఖ్యంగా రేసింగ్ ఎడిషన్ విలక్షణమైన బాడీ గ్రాఫిక్స్, పెయింట్ స్కీమ్లను పరిచయం చేసింది. ఇకపై తాజాగా విడుదల చేసిన అపాచీ ఆర్‌టీఆర్ 160 బైక్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. అపాచీ ఆర్‌టీఆర్ 160 2 వీ రేసింగ్ ఎడిషన్ బైక్ గ్రే గ్రాఫిక్స్, రేసింగ్ రెడ్ స్ట్రిప్స్ యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మ్యాట్ బ్లాక్ కలర్ స్కీమ్ బైక్ కు స్టైలిష్ లుక్ జోడిస్తుంది. ముఖ్యంగా బాడీ ప్యానెల్స్ పై కార్బన్ ఫైబర్ లుక్ ఆకర్షిస్తుంది. ఇది బైక్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. ట్రాక్ టు రోడ్ ఎథోస్ ఫీచర్ తో మోటార్ సైకిల్ రేస్-ప్రేరేపిత గ్రాఫిక్స్, రేసింగ్ ఎడిషన్ లోగోతో వస్తుంది. ఇది డైనమిక్ కాంట్రాస్ట్ కోసం అద్భుతమైన రెడ్ కలర్ స్పోక్ అల్లాయ్ వీల్స్ తో యువతను ఆకట్టుకుంటుది.
రేసింగ్ ఎడిషన్ ప్రామాణిక అపాచీ ఆర్‌టీ 160 బైక్‌కు అనుగుణంగా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌లు, టెయిల్యాంప్‌లు, టీవీఎస్ గ్లైడ్ త్రూ టెక్నాలజీతో పాటు టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీని అనుసంధానించే ఎల్‌సీడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌తో వస్తుంది. అలాగే రైడర్లు మూడు రైడింగ్ మోడ్లను ఎంచుకోవచ్చు. స్పోర్ట్, అర్బన్, రెయిన్ మోడ్స్‌ను విభిన్న రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. అలాగే హార్డ్ వేర్ బ్యాలెన్స్డ్ హ్యాండ్లింగ్ కోసం ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఇక బ్రేకింగ్ పనితీరు 270 ఎంఎం ఫ్రంట్ పెటల్ డిస్క్, సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో 220 ఎంఎం వెనుక పెటల్ డిస్క్ ద్వారా ఈ బైక్ అమితంగా ఆకట్టుకుంటుంది. అపాచీ రేసింగ్ ఎడిషన్‌లో విశ్వసనీయమైన 159.7సీసీ సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్ ఇంజన్ 15.82 బీహెచ్‌పీ శక్తిని, 13.85 ఎన్ఎం టార్క్‌ను ప్రతిస్పందించే ఐదు-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది.