Tata EV: టాటా నుంచి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్ తో ఏకంగా అన్ని కిలోమీటర్ల ప్రయాణం!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా కంపెనీ నుంచి ఇప్పుడు మార్కెట్లోకి మరొక ఎలక్ట్రిక్ కారు విడుదల అయ్యింది. మరి ఆ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:55 PM, Mon - 17 March 25

ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కాగా టాటా కంపెనీ రాబోయే హారియర్ ఈవీ ప్రొడక్షన్ రెడీ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఈ కారు త్వరలో ఇండియాలో అందుబాటులోకి రావచ్చట. ఇంతకుముందు ఈ కారు జనవరి 2025లో జరిగిన ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది టాటా కంపెనీ. అయితే అప్పుడు ఇది కేవలం ఎగ్జిబిషన్ మోడల్ మాత్రమే. కానీ ఇప్పుడు టాటా ఈ కారును టెస్ట్ ట్రాక్ లో నడపడం ద్వారా దాని సామర్థ్యాలను ప్రదర్శించిందట.
కాగా ఈ హరియర్ ఈవీ కారు అద్భుతమైన డిజైన్ తో రానుంది. దాని లుక్ పెట్రోల్ వెర్షన్ ని పోలి ఉంటుందట. అయితే దీనిలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసిందట. అదేమిటంటే ఇది పెట్రోల్ వెర్షన్ నుండి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా కారు డిజైన్ ను మరింత మెరుగుపరచడం కోసం దీనిలో కొత్త స్టైల్ అల్లాయ్ వీల్స్ ను ఏర్పాటు చేశారట. కారు వెనుక భాగం మునుపటిలాగే కనిపిస్తుందట. కానీ దీనికి కనెక్ట్ చేయబడిన LED టెయిల్ లైట్లు ఉంటాయట. అలాగే ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుందని, అలాగే వెనుక బంపర్ కూడా పునః రూపకల్పన చేయబడిందని చెబుతున్నారు. ఇప్పుడు ముందు బంపర్ లాగా నిలువు స్లాట్ లకు సరిపోతుందట. లోపలి భాగంలో టాటా హారియర్ ఈవీ లేఅవుట్ పెట్రోల్ వెర్షన్ ని పోలి ఉంటుందట.
క్యాబిన్ ముఖ్యాంశాలు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో ఉందట. ఇందులో 10.25 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ ఉన్నాయట. అలాగే భద్రత కోసం దీనికి ఏడు ఎయిర్ బ్యాగులు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, ఆటో హోల్డ్ తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, TPMS, ADAS వంటి ఫీచర్లను అందించింది టాటా కంపెనీ.