Ola S1 Z: మార్కెట్లోకి రెండు నయా స్కూటర్ లను విడుదల చేసిన ఓలా.. ధర, ఫీచర్స్ ఇవే!
ఇండియా మార్కెట్ లోకి ఇప్పుడు మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లను విడుదల చేసింది ఓలా.
- By Anshu Published Date - 11:03 AM, Sat - 30 November 24

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఓలా ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటుగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 ఈ పేర్లతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది ఓలా. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ స్కూటర్ లను చార్జ్ చేయడానికి పోర్టబుల్ హెూమ్ ఇన్వర్టర్ ఉపయోగించవచ్చట.
ఫిక్స్‌డ్ బ్యాటరీలు ఉన్న స్కూటర్లతో పోలిస్తే రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్లతో వచ్చే స్కూటర్లను ఇటీవల వినియోగదారులు అధికంగా ఇష్టపడడంతో అన్ని కంపెనీలు రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్ తో వచ్చే ఈవీలను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా కూడా తాజాగా రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్ తో పనిచేసే స్కూటర్లను విడుదల చేసింది. ఈ బ్యాటరీలను ఈజీగా ఇంట్లో లేదా కార్యాలయంలో ఛార్జ్ చేయవచ్చట. కాగా ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 ఈ స్కూటర్లు కొన్ని భిన్నమైన వేరియంట్స్ తో అందుబాటులోకి తీసుకొచ్చారు. బేస్ మోడల్ వ్యక్తిగత ఉపయోగాలను అందిస్తుంది.
టాప్ స్పెక్ జెడ్ ప్లస్ మోడల్ ప్రైవేట్, వాణిజ్య అవసరమయ్యేలా డ్యూయల్ యూజ్ ఈ స్కూటర్‌గా లాంచ్ చేశారు. ఓలా ఎస్1 జెడ్ బాక్సీ సిల్హౌట్ తో వస్తుంది. టాప్ స్పెక్ జెడ్ ప్లస్ వేరియంట్ రెండు చివర్లలో కార్గో రాక్స్, పిలియన్ సైడ్ స్టెప్, వైజర్, మొబైల్ ఫోన్ హెూల్డర్ వంటి అదనపు ఉపకరణాలతో వస్తున్నాయి. బేస్ వెర్షన్ 12 అంగుళాల చక్రాలతో వస్తుంది. అయితే ఎస్1జెడ్ ప్లస్ 14 అంగుళాల ఎంపికలతో వస్తుంది. ఈ రెండు మోడల్లు రైడర్ కోసం ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తో వస్తున్నాయి. ఓలా ఎస్1 జెడ్ శ్రేణి 2.9 కేడబ్ల్యూ హబ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 4 బీహెచ్‌పీ శక్తితో వస్తుంది. ఓలా ఎస్1 జెడ్ 8 సెకన్లలో 20 కిలో మీటర్లకు చేరుకుంటుంది.
అలాగే 4.8 సెకన్లలో 0 40 కిలో మీటర్ల వేగంతో వస్తుంది. ఓలా ఎస్1 జెడ్ 1.5 కేడబ్ల్యహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఒక బ్యాటరీ ప్యాక్ తో ఎస్1 జెడ్ ఒక చార్జీపై ఐడీసీ సర్టిఫైడ్ 75 కి.మీ పరిధిని అందిస్తుంది. ఓలా జెడ్1 రూ.59,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. అలాగే ఓలా ఎస్1 జెడ్ ప్లస్ వేరియంట్ రూ.64,999 ధరతో లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ స్కూటర్లు 499 టోకెన్ మొత్తానికి బుకింగ్ లను ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్ డెలివరీలు మే 2025న షెడ్యూల్ చేశారు.