Motorcycle Servicing: మీ బైక్ ని సర్వీసింగ్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి!
మీరు కూడా బైక్ సర్వీసింగ్ చేయిస్తున్నారా, అయితే తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:01 PM, Fri - 14 March 25

మామూలుగా బండి కొత్తగా కొనుగోలు చేసినప్పటి నుంచి మనం బైక్ సర్వీసింగ్ కు ఇవ్వడం అన్నది కామన్. రెండు మూడు సర్వీస్ లు షో రూమ్ లోనే ఫ్రీగా చేయిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత నుంచి బయట ప్రైవేట్ గా బైక్ సర్వీసింగ్ చేయించుకుంటూ ఉంటారు. చాలామందికి బైక్ సర్వీసింగ్ చేయించే సమయంలో కొన్ని రకాల విషయాలు అసలు తెలియదు. అవేమిటంటే బైక్ సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలి? ఎన్ని కిలోమీటర్లకు చేయించాలి అన్న విషయాల గురించి సరైన అవగాహన ఉండదు. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మీ బైక్ యొక్క పనితీరు బాగుండాలి అనుకుంటే, మంచి మైలేజ్ రావాలి అనుకుంటే ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం అవసరం. బైక్ రెగ్యులర్ సర్వీసింగ్ ఇంజిన్ జీవితానికి మాత్రమే కాకుండా పనితీరు, మైలేజీకి కూడా ముఖ్యమైనదని చెప్పాలి. ఎన్ని కిలో మీటర్లు సర్వీసింగ్ ను పూర్తి చేయాలనేది తెలుసుకోవాలి. అయితే బైక్ అయినా, స్కూటర్ అయినా ప్రతి 2 వేల కిలో మీటర్లకు ఒక్కసారి సర్వీస్ ను అందించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఒకవేళ మీరు సరైన సమయంలో సర్వీసింగ్ చేస్తూ ఉంటే, ఇంజిన్ జీవితకాలం మరింత బాగుంటుందట. అలాగే బైక్ పనితీరు కూడా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. బైక్ మీకు లీటరు ఇంధనానికి ఎక్కువ కిలో మీటర్ల మైలేజీని ఇస్తుందట.
మీరు 2 వేల కిలో మీటర్లలో సర్వీస్ చేయకపోతే, మీరు కనీసం 2500 కి.మీల సర్వీసింగ్ చేయాలని చెబుతున్నారు. మీరు 2500 కిలో మీటర్ల తర్వాత సర్వీస్ చేస్తే, బైక్ పిస్టన్, క్లచ్ ప్లేట్, చైన్ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఒకవేళ ఇదే గనుక జరిగితే పిస్టన్ రిపేర్ కు దాదాపుగా 3 వేల రూపాయలు, పిస్టన్, క్లచ్ ప్లేట్ రిపేర్ కు 4500 రూపాయల వరకు ఖర్చు అవుతుందట. అలాగే ఇంజన్ చెడిపోతే ఆ ఖర్చు మరింత పెరగవచ్చు. రూ.6 నుంచి రూ.7 వేల వరకు కావచ్చు. ఎందుకంటే బైక్ స్పేర్ పార్ట్స్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు 5 వేల కి.మీల వరకు సర్వీస్ చేస్తున్న కొత్త మోడల్స్ చాలా వస్తున్నాయి. అయితే 2000 నుండి 2500 కి.మీల మధ్య సర్వీస్ చేయాల్సిన బైక్ లు ఇంకా చాలానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే మీ బైక్ ని సకాలంలో అనుకున్న సమయానికి సర్వీసింగ్ చేయిస్తూ ఉండడం వల్ల బైక్ యొక్క జీవిత కాలం ఎక్కువ కాలం ఉంటుందట.