Car Discount: దసరా బంపర్ ఆఫర్.. ఆ కారుపై ఏకంగా అన్ని లక్షల డిస్కౌంట్?
ఫెస్టివల్ సీజన్ కారణంగా ఆ కార్లపై ఏకంగా లక్షల్లో డిస్కౌంట్ ను అందిస్తున్న మారుతి సుజుకి.
- By Anshu Published Date - 01:00 PM, Sun - 8 September 24

ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కొనసాగుతోంది. అందులో భాగంగానే వినాయక చవితి పండుగ సందర్భంగా 11 రోజుల పాటు ఈ వినాయక చవితి పండుగ సీజన్ జరగనుంది. ఈ వినాయక చవితి పండుగ, తర్వాత కొద్ది రోజుల గ్యాప్ తో మళ్ళీ వెంటనే దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దీపావళి పండుగ ఇలా వరుసగా పండుగలు ఉండడంతో ఫెస్టివల్ సీజన్ మొదలైపోయింది. ఈ పండుగ సీజన్లలో కార్లు బైక్లు మొబైల్ ఫోన్లు ఇలా ప్రతి ఒక్క వాటిపై డిస్కౌంట్ లు లభించనున్నాయి. ఇక ఇలా పండుగ సీజన్ల లోనే జనాలు కూడా వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. సెప్టెంబర్ నెలలో ప్రస్తుతం మారుతి సుజుకి తన SUV జిమ్నీపై అదిరిపోయే డిస్కౌంట్ ను అందించింది.
మీరు ఈ నెలలో జిమ్నీ కొనుగోలుపై మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. గత కొన్ని నెలలుగా జిమ్నీపై మంచి డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ నెల మారుతీ సుజుకి జిమ్నీపై రూ.2.50 లక్షల వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ నెలలో, అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్న ఏకైక కంపెనీ మారుతీ సుజుకి అని చెప్పాలి. జిమ్నీ టాప్ వేరియంట్ ఆల్ఫాపై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. జీటా వేరియంట్ పై కంపెనీ ఏకంగా రూ.1.95 లక్షల వరకు ఆఫర్ అందిస్తోంది. జిమ్నీ ధర రూ.12.74 లక్షల నుంచి రూ.14.95 లక్షల వరకు ఉంది. ఈ వెహికల్ లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అంతేకాదు ఇందులో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. ఇంజిన్ చాలా పవర్ ఫుల్ అన్ని రకాల వెదర్ కండిషన్స్ లోనూ పనిచేస్తుంది. సిటీ, హైవేలో జిమ్నీ పనితీరు చాలా బాగుంది. ఈ కారు ఒక లీటర్‌లో 16.94 కి.మీల మైలేజీని అందిస్తుంది.
మారుతి తన గ్రాండ్ విటారాపై కూడా ఈ నెలలో మంచి డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెలలో ఈ ఎస్‌యూవీపై రూ.1.28 లక్షల వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ హైబ్రిడ్ వెర్షన్ కారుపై అందిస్తోంది. ఇది కాకుండా, మైల్డ్ హైబ్రిడ్‌పై రూ.73,000, SUV CNG వేరియంట్ లపై కూడా రూ.33,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈ నెలలో మారుతి సుజుకి బాలెనో కొనుగోలుపై రూ.52,000 డిస్కౌంట్ ను అందిస్తోంది. బాలెనో ఆటో మేటిక్ మోడల్‌పై ఈ డిస్కౌంట్ ను పొందవచ్చు. మాన్యువల్ మోడల్స్‌పై రూ.47,100 వరకు CNGపై రూ.37,100 వరకు డిస్కౌంట్ చేసుకోవచ్చు.
ఇది మాత్రమే కాదు, ఈ నెలలో మారుతీ ఎక్స్‌ఎల్ 6 పెట్రోల్ వేరియంట్‌లపై రూ.35,000 సిఎన్‌జిపై రూ.25,000 డిస్కౌంట్ చేసే అవకాశం ఉంది. ఈ నెలలో మారుతి సియాజ్ కొనుగోలు చేయడం ద్వారా రూ.45,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ.20,000 నగదు డిస్కౌంట్ రూ.25,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. ఇగ్నిస్ కొనుగోలుపై రూ.53,100 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ దాని ఆటోమేటిక్ వేరియంట్ లపై ఉంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో కూడిన ఇగ్నిస్ సిగ్మా పై రూ. 53,100. మాన్యువల్ వేరియంట్ లపై రూ. 48,100 బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.