Mahindra Thar Roxx: ఎట్టకేలకు లాంచ్ అయిన మహీంద్రా థార్ రోక్స్.. పూర్తి వివరాలు ఇవే!
మహీంద్రా థార్ రోక్స్ కారు తాజాగా భారత మార్కెట్ లోకి విడుదల అయ్యింది.
- By Anshu Published Date - 12:00 PM, Fri - 16 August 24

తాజాగా మహీంద్రా థార్ రోక్స్ ఎస్‌యూవీని ఆగస్టు 14 న లాంచ్ అయిన విషయం తెలిసిందే. ముందుగా అనౌన్స్ చేసిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే ఈ సూపర్ స్టైలిష్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ 5-డోర్ల వెర్షన్ ఎంట్రీ లెవల్ ఎంఎక్స్ 1 పెట్రోల్ ప్రారంభ ధర రూ .12.99 లక్షలుగా ఉంది. అదే సమయంలో ఎంఎక్స్ 1 డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ .13.99 లక్షలుగా ఉంది. ఇక మూడు డోర్ల మోడల్ కంటే డీజిల్ వేరియంట్ ధర రూ.1.64 లక్షలు ఎక్కువగా ఉంది. కాగా మహీంద్రా థార్ రోక్స్ అన్ని వేరియంట్ల జాబితాను ఆగస్టు 15 వెల్లడించారు.
అలాగే వేరియంట్ల వారీగా ధరలను కూడా ప్రకటించారు. కంపెనీ తన బేస్ వేరియంట్ ఎంఎక్స్ 1 ఫీచర్లకు తెర తీసింది. ఇందులో చాలా గొప్ప గొప్ప ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా థార్ రోక్స్ లో స్ట్రాంగ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ ఇంకా దాని అన్ని ఫీచర్లను ఆవిష్కరించలేదు. కానీ బయటకు వచ్చిన వివరాలన్నీ దీనిని బలమైన ఎస్‌యూవీగా కనిపిస్తుంది. మహీంద్రా థార్ రోక్స్ సేఫ్టీ ఫీచర్లకు సంబంధించి కెమెరా ఆధారిత లెవల్2 ఏడీఏఎస్ సూట్ ను అందించారు. నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, 6 ఎయిర్ బ్యాగులు, ప్రయాణీకులందరికీ 3 పాయింట్ల సీటు బెల్టులు, టీసీఎస్, టిపిఎంఎస్, ఈఎస్పి లాంటి ఇతర భద్రతా ఫీచర్లు సైతం ఇందులో అందించారు. ఆఫ్ రోడింగ్ ను సులభతరం చేయడానికి, మహీంద్రా క్రాల్ స్మార్ట్ అసిస్ట్, ఇంటెల్లీ టర్న్ అసిస్ట్ తో పాటు ఎలక్ట్రానిక్ గా లాక్ చేయగల వ్యత్యాసాన్ని కూడా అందిస్తోంది.
ఇకపోతే మహీంద్రా థార్ రోక్స్ ఎంఎక్స్ 1 బేస్ వెరియంట్ విషయానికి వస్తే.. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను పొందుతుంది. ఇది 162 బిహెచ్‌పీ గరిష్ట శక్తిని, 330 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో కొత్త డీజిల్ ఎంపిక కూడా ఉంది. ఇందులోని 2.2 లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పీ పవర్, 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ ట్రాన్సిషన్ తో వస్తాయి.