‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్
'Mahindra' Bumper offer : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా (Mahindra) వినియోగదారులకు ముందుగానే ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జీఎస్‌టీ సవరణల వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రోజు నుంచే తమ ఎస్‌యూవీ వాహనాలపై వర్తింపజేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది
- By Sudheer Published Date - 05:22 PM, Sat - 6 September 25

జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు కొన్ని కార్ల ధరలు తగ్గనున్న విషయం తెలిసిందే. ఈ తగ్గింపులు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి. అయితే, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా (Mahindra) వినియోగదారులకు ముందుగానే ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జీఎస్‌టీ సవరణల వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రోజు నుంచే తమ ఎస్‌యూవీ వాహనాలపై వర్తింపజేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. దీంతో వినియోగదారులు రూ. 1.56 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం లభించింది. ఈ నిర్ణయం ద్వారా వినియోగదారులకు తక్షణ ప్రయోజనం కల్పించిన తొలి సంస్థగా మహీంద్రా నిలిచింది.
Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఈ శుభవార్తను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “ప్రామిస్ చేయడమే కాదు.. చేసి చూపిస్తాం. థాంక్యూ మహీంద్రా ఆటో” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆనంద్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా జీఎస్‌టీ మార్పులు అమల్లోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ, మహీంద్రా సంస్థ వేగంగా స్పందించి తమ వినియోగదారులకు వెంటనే ప్రయోజనం కల్పించడం పట్ల అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ధరల తగ్గింపు మహీంద్రా ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప అవకాశంగా మారింది. థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లపై ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ ఆఫర్ వల్ల మహీంద్రా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వినియోగదారులకు ముందుగానే ప్రయోజనం అందించాలనే మహీంద్రా నిర్ణయం ఇతర కార్ల తయారీ సంస్థలకు ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం కంపెనీపై వినియోగదారుల నమ్మకాన్ని మరింత పెంచుతుంది అనడంలో సందేహం లేదు.