Best Electric Bikes: ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. తక్కువ ధరకే బెస్ట్ బైక్స్ ఇవే!
ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారికోసం ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటున్న బెస్ట్ బైక్స్ గురించి తెలిపారు.
- By Anshu Published Date - 10:00 AM, Thu - 19 December 24

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్స్ కి మార్కెట్లో క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో బైక్ తయారీ సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అలా ఇప్పటికే చాలా రకాల బైక్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ బైక్స్ లో ఏది మంచిది ఏది కొనుగోలు చేయాలి అన్న విషయంపై చాలామంది తికమక పడుతూ ఉంటారు. మరి ఎలక్ట్రిక్ బైక్స్ లో తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ బైక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒబెన్ రోర్ మోటారు సైకిల్ రూ.1.50 లక్షల ధరలో లభిస్తోంది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 187 కిలో మీటర్ల రేంజ్ ని అందిస్తుంది. ఈ బండి గరిష్ట వేగం గంటకు 100 కిలో మీటర్లు. ఎకో, స్పీడ్, హావోక్ అనే మూడు రకాల డ్రైవ్ మోడ్ లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీని కేవలం రెండు గంటల్లోనే దాదాపు 80 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. దీనిలో 8 కేడబ్ల్యూ పీఎంఎస్ఎం మోటారు ఏర్పాటు చేశారు.
ఒకాయ ఫెర్రాటో డిస్ట్రప్టర్ బైక్ రూ.1.60 లక్షలకు అందుబాటులో ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 95 కిలో మీటర్లుగా ఉంది. ఫుల్ చార్జింగ్ తో సుమారు 129 కిలో మీటర్లు పరుగులు పెడుతుంది. ఈ బైక్ 6.37 కేడబ్ల్యూ పవర్, 45 ఎన్ఎం టార్క్ ను విడుదల చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 3.97 కేడబ్ల్యూహెచ్ వద్ద రేట్ చేయబడింది. కనెక్టివీటి ఫీచర్లు, లైవ్ ట్రాకింగ్, సౌండ్ బాక్స్ తదితర ప్రత్యేకతలతో స్పోర్ట్స్ లుక్ లో ఆకట్టుకుంటోంది.
ఇకపోతే దూర ప్రయాణాలు ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి టోర్క్ క్రాటోస్ ఆర్ మోటారు సైకిల్ బాగుంటుందని చెప్పాలి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు సుమారు 180 కిలో మీటర్ల రేంజ్ ని అందిస్తుంది. అలాగే గంటకు 105 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీనిలోని 9కేడబ్ల్యూ పీఎంఏసీ మోటారు నుంచి 38 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. 4కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ అమర్చారు. ఈ బైక్ ధర రూ.1.50 లక్షలుగా ఉంది.
రివోల్ట్ ఆర్వీ 400 మోటారు సైకిల్ ధర రూ.1.20 లక్షలుగా ఉంది. ఫుల్ చార్జింగ్ తో సుమారు 150 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలో మీటర్లుగా ఉంది. దీనిలో స్మార్ట్ ఫీచర్లతో పాటు మూడు రైడింగ్ మోడ్ లతో కూడిన మొబైల్ యాప్ ఉంది. టెక్నాలజీపై అవగాహన ఉన్న రైడర్లకు చాలా ఉపయోగంగా ఉంటుంది.
హోప్ ఎలక్ట్రిక్ ఓఎక్స్ ఒక మోటారు సైకిల్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 140 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 88 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. దీన్ని 80 శాతం చార్జింగ్ చేయడానికి సుమారు 4.15 గంటల సమయం పడుతుంది. వివిధ ఫీచర్లతో కూడిన ఐదు అంగుళాల డిజిటల్ డిస్ ప్లే ఆకట్టుకుంటోంది. ఈ బైక్ రూ.1.34 లక్షల ధరకు అందుబాటులో ఉంది.