Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Automobile News
  • ⁄Kawasaki Z400 2023 In India

2023 Kawasaki Z400 : స్పోర్టియర్ లుక్ తో కవాసకి…ధర ఎంతో తెలుసా..?

జపాన్ కు చెందిన ప్రముఖ బైక్ ల తయారీదారు సంస్థ కవాసకి...అంతర్జాతీయ మార్కెట్లోకి సరికొత్త 2023 కవాసకి Z400 బైక్ ను విడుదల చేసింది. దీంతోపాటే నింజా 400 స్పోర్ట్స్ బైక్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

  • By Bhoomi Published Date - 12:00 PM, Sat - 11 June 22
2023 Kawasaki Z400 : స్పోర్టియర్ లుక్ తో కవాసకి…ధర ఎంతో తెలుసా..?

జపాన్ కు చెందిన ప్రముఖ బైక్ ల తయారీదారు సంస్థ కవాసకి…అంతర్జాతీయ మార్కెట్లోకి సరికొత్త 2023 కవాసకి Z400 బైక్ ను విడుదల చేసింది. దీంతోపాటే నింజా 400 స్పోర్ట్స్ బైక్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

లెటెస్టు కవాసకి Z400మోటార్ సైకిల్ గురించి చూస్తే…దీని పవర్ ప్లాంట్ అతిపెద్ద అప్ డేట్ లతో ఒకటి. కంపెనీ దీనిని నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్ డేట్ చేసింది. ఇది యూరో 5 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అయితే ఇంజన్ ఇప్పటికీ అదే 399సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ యూనిట్ ను కలిగి ఉంది. ఇది 44బీహెచ్పీ పవర్ వద్ద 37ఎన్ఎం టార్క్ ను అందిస్తుంది. పవర్ అవుట్ పుట్ అలానే ఉన్నప్పటికీ…కొత్త మోడల్లో టార్క్ ఫిగర్ 1ఎన్ఎం తగ్గింది. ఈ ఇంజన్ను స్లిప్పర్ క్లచ్ మెకానిజంతో 6 స్పీడ్ గేర్ బాక్స్ తో జతచేశారు.

డిజైన్ స్పెసిఫికేషన్స్…
ఇక డిజైన్ పరంగా స్వల్ప మార్పుుల చేశారు. పాత మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. ముఖ్యంగా 2022 కవాసకి నింజా 400ZH2ప్రేరేపిత స్టైలింగ్ ను కలిగి ఉంది. ఇందులో సింగిల్ పాడ్ హెడ్ లైట్, ష్రౌడ్స్ కవచాలతో కూడిన ఇంధన ట్యాంక్, స్టెప్ అప్ సీటు, సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. రోడ్ స్టర్ సెగ్మెంట్ మోటార్ సైకిల్ కావడంతో Z400నింజా 400లో క్లిప్ ఆన్ స్టైల్ యూనిట్స్ కు బదులుగా సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ను ఉపయోగిస్తుంది.

ఇక Z400క్యాండీ లైమ్ గ్రీన్ విత్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ తోపాటు పెరల్ రోబోటిక్ వైట్ విత్ మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే అనే రెండు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. బైక్ హార్డ్ వేర్ కిట్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 41ఎంఏం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్క్ సస్పెన్షన్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ రియర్ మోనో షాక్స్ ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో ఒకే 310 ఎంఎం డిస్క్ అలాగే బ్యాక్ సైడ్ లో 220ఎంఎం డిస్క్ లను అమర్చబడి ఉంది. Z400కొత్త BS-VIఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్నా ప్రస్తుతానికి ఈ బైక్ ఇండియన్ మార్కెట్లోకి వస్తుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే 2023 నింజా 400మాత్రం భారత్ లో రిలీజ్ కానుంది. ఈ బైక్ ధరలు సుమారు రూ. 4.60 నుంచి రూ. త4.75లక్షల వరకు ఉండనున్నాయి.

 

 

Tags  

  • Bikes
  • Kawasaki
  • Kawasaki Z400 2023

Related News

    Latest News

    • India Warm Up Match: రెండో వార్మప్ మ్యాచ్ లోనూ భారత్ విజయం

    • Ind Vs Eng: బెయిర్ స్టో రికార్డుల జోరు

    • Congress : నేడు సంచలన నిర్ణయం ప్ర‌క‌టించ‌నున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

    • Maharashtra : నేడు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌

    • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

    Trending

      • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

      • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

      • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

      • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

      • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: