Car AC Tips: కారులో ఏసీ పనితీరు సరిగా లేదా.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే?
మాములుగా వర్షాకాలంలో కార్లలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి. ఏసీ పనితీరు కూడా ఒకటి. వర్షాకాలంలో చుట్టూ వాతావరణం లో తేమ ఉండడం వల్ల
- By Nakshatra Published Date - 07:00 PM, Wed - 5 July 23
మాములుగా వర్షాకాలంలో కార్లలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి. ఏసీ పనితీరు కూడా ఒకటి. వర్షాకాలంలో చుట్టూ వాతావరణం లో తేమ ఉండడం వల్ల కారు ఏసీ మిమ్మల్ని క్యాబిన్‌ను చల్లబరుస్తుంది. ఇది ఉక్కబోత నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. మరి ముఖ్యంగా కారులో సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అసౌకర్యం, అధిక చెమట, అలసటను నివారిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏసీ అంత సమర్థవంతంగా పని చేయడం లేదని మనం గమనిస్తూ ఉంటాం. అయితే కారు ఏసీ పనితీరుపై సర్వీస్ సెంటర్లోని టెక్నీషియన్ చూపించినా ఏసీ బాగానే ఉందని చెబుతూ ఉంటారు. అయితే మనం మాత్రం కారులో ఏసీ పనితీరుపై సంతృప్తిగా ఉండలే. కాబట్టి కారు ఏసీ పనితీరు మెరుగుపర్చడానికి ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామూలుగా మనం వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో ఎప్పుడైనా కానీ కారు పార్కింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నీడకు పార్కింగ్ చేయాలి. ముఖ్యంగా ఉదయం సమయంలో పార్క్ చేసే సమయంలో కారుకు ఎండ తగలని ప్రదేశాల్లో పార్క్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల కారులోని టెంపరేచర్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. దాంతో కారులోని ఏసీ వేయగానే వెంటనే చల్లబడుతుంది. అదేవిధంగా మీ కారు ఏసీని రీసర్క్యులేషన్ మోడ్‌కి మార్చాలి. ఇది క్యాబిన్ లోకి బయటి నుంచి వేడి గాలి రాకుండా చేస్తుంది. ఈ మోడ్ గాలిని వేగంగా చల్లబరుస్తుంది. అలాగే ఏసీ సిస్టమ్‌పై పనిభారాన్ని తగ్గిస్తుంది. అలాగే మీ కారు నేరుగా సూర్యకాంతిలో పార్క్ చేసి ఉంచడం మంచిది.
కిటికీలను తెరిచి ఏసీని ఆన్ చేయడానికి ముందు కొన్ని నిమిషాల పాటు వేడి గాలిని బయటకు వచ్చేలా చేయాలి. ఇది క్యాబిన్ నుంచి వేడి గాలిని త్వరగా బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఈలోగా గాలి త్వరగా బయటకు వెళ్లేలా ఫ్యాన్ లను ఆన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా కారులోని ఏసీ సమర్థవంతంగా పని చేస్తుంది. మీ కారు ఏసీ సిస్టమ్ లోని ఎయిర్ ఫిల్టర్ లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. తప్పదనుకుంటే వాటిని మార్చుతూ ఉండాలి. డర్టీ ఫిల్టర్లు గాలి ప్రవాహాన్ని నిరోధించగలవు. గాలిని చల్లబరచడానికి ఏసీ కష్టపడి పని చేస్తుంది. ఏసీ యాక్టివేట్ చేయడానికి ముందు ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు అత్యధిక సెట్టింగ్‌లో ఫ్యాన్‌ని రన్ చేయడం ద్వారా ఏసీ ఫిల్టర్లు క్లీన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కారును పార్క్ చేసి ఉంచినప్పుడు నేరుగా సూర్యరశ్మిని నిరోధించడానికి విండ్షీల్డ్పై సన్‌షేడ్, సైడ్ విండోస్‌పై విండో విజర్లను ఉపయోగించండి. ఇది ఇంటీరియర్‌ను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఏసీపై లోడ్‌ను తగ్గిస్తుంది.
Tags
Related News
Driving License: రెండు చేతులు కోల్పోయిన యువకుడికి లైసెన్స్
రెండు చేతులు కోల్పోయిన తమిళనాడు యువకుడు కారు నడిపేందుకు లైసెన్స్ పొంది రికార్డు సృష్టించాడు. తాన్సేన్ (31) చెన్నై వ్యాసర్పాడి పెరియార్‌కు చెందినవాడు. పదేళ్ల వయసులో విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. పట్టుదలతో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతనికి వివాహమై ఏడాదిన్నర కుమార్తె ఉంది.