ADAS : త్వరలో అన్ని కార్లలో ADAS.. ఏమిటిది ?
ADAS : దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో కేంద్ర సర్కారు కీలకమైన ప్లానింగ్ చేస్తోంది.
- By pasha Published Date - 01:20 PM, Fri - 17 November 23

ADAS : దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో కేంద్ర సర్కారు కీలకమైన ప్లానింగ్ చేస్తోంది. వాహనాల్లో ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్’ (ADAS)ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. దీనివల్ల రోడ్డు భద్రత పెరిగి, ప్రమాదాలు తగ్గుతాయని యోచిస్తోంది. ఈ దిశగానే ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తొలి అడుగు వేసింది. పాసింజర్, వాణిజ్య అవసరాలకు వాడే ఫోర్ వీలర్ వాహనాల్లో ‘మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ (MOIS)ను ఇన్స్టాల్ చేయాలని ప్రతిపాదించింది. MOIS అనేది వాహనం సమీపంలోని పాదచారులు, సైక్లిస్ట్ల ఉనికిని డ్రైవర్‌కు తెలియజేస్తుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనం వేగాన్ని తగ్గించడానికి వీలవుతుంది. అతివేగంగా వచ్చే వాహనాల వల్ల పాదచారులు, సైక్లిస్టులు ప్రమాదాల బారినపడకుండా MOIS నిరోధిస్తుందని కేంద్ర సర్కారు భావిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
రానున్న రోజుల్లో వాహనాల్లో MOISను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసే దిశగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యంగా M2, M3, N2, N3 వాహనాల్లో MOIS వ్యవస్థను తీసుకొస్తారని సమాచారం. ఇందుకోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఒక ముసాయిదాను కూడా తయారు చేసింది. మన దేశంలో ఇప్పటికే పలు వాహన తయారీ సంస్థలు ADASను తమ వాహనాల్లో ప్రవేశపెట్టాయి. ఇకపై దీన్ని తప్పనిసరి చేయనున్నారు. అదే జరిగితే.. వాహన కంపెనీల అన్ని రకాల వేరియంట్లలో కచ్చితంగా లెవల్ 1 ADAS వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా కార్ల ధరలు కొంతమేర పెరుగుతాయి. భారత్‌లో 2022లో రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. ప్రతి గంటకు 4.6 లక్షలకుపైగా ప్రమాదాలు, 19 మరణాలు సంభవిస్తున్నాయి. 2024 నాటికి రోడ్డు ప్రమాదాలను, మరణాల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం(ADAS) భావిస్తోంది.
Related News

Saudi – IPL Franchise : ఐపీఎల్‌లోకి సౌదీ ఎంట్రీ.. ఏం చేయబోతోంది ?
Saudi - IPL Franchise : ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల దిశగా అడుగులు వేస్తుండటం పెట్రోలియం ఉత్పత్తులకు ప్రపంచ రాజధానిగా వెలుగొందుతున్న సౌదీ అరేబియాకు కలవరం కలిగిస్తోంది.