Car Discount: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే?
కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే ఇది మీ కోసమే. అయితే కొన్ని కార్ల సంస్థలు వాటి వాహనాలపై ఏకంగా లక్షల్లో తగ్గింపు ఆఫర్లను ప్రకటి
- Author : Anshu
Date : 12-03-2024 - 3:02 IST
Published By : Hashtagu Telugu Desk
కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే ఇది మీ కోసమే. అయితే కొన్ని కార్ల సంస్థలు వాటి వాహనాలపై ఏకంగా లక్షల్లో తగ్గింపు ఆఫర్లను ప్రకటించాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. హ్యుందాయ్ ఆల్కజార్ పెట్రోల్, డీజిల్ మోడళ్లపై రూ. 15,000 నగదు తగ్గింపు, అలాగే రూ. 20,000 ఎక్స్చేంజ్ ఆఫర్ అందించబడుతోంది. టక్సన్ పెట్రోల్ మోడల్‌పై 50 వేల రూపాయల నగదు తగ్గింపు, డీజిల్ మోడల్‌పై 2 లక్షల రూపాయల తగ్గింపు ఉంది. హ్యుందాయ్ వెన్యూ 2024..హ్యుందాయ్ వెన్యూ 2024 మోడల్, ప్రత్యేక వేరియంట్‌లపై నగదు తగ్గింపులు, అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందించబడుతున్నాయి.
కొనుగోలుదారుకు రూ.30 వేలు నగదు తగ్గింపుతో పాటు రూ.25 వేల ఎక్ఛైంజ్ విలువ లభిస్తోంది. వెన్యూ 2023 మోడల్‌పై కూడా అదే ఆఫర్ అందిస్తోంది కంపెనీ. హ్యుందాయ్ ఆరా CNG అన్ని వేరియంట్లపై మొత్తం 33 వేల రూపాయల తగ్గింపు అందిస్తోంది. ఆరా పెట్రోల్, డీజిల్ మోడళ్లపై రూ. 10,000 నగదు తగ్గింపు, అలాగే ఎక్స్ఛేంజ్ కూడా అందించ బడుతోంది. ఈ ఆఫర్ 2023, 2024 మోడల్‌లకు మాత్రమే. గ్రాండ్ i10 Nios.. మాన్యువల్, నాన్-CNG వేరియంట్‌లు రూ. 28,000 తగ్గింపు లభిస్తుంది.
దాని ఆటోమేటిక్ మోడళ్లపై రూ.18,000 తగ్గింపు, CNG మోడల్స్‌పై రూ.43,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కొత్త హ్యుందాయ్ ఐ20పై రూ. 15,000 నగదు తగ్గింపు, అలాగే ఐ20 ఎన్ లైన్‌పై రూ. 20,000 నగదు తగ్గింపు అందిస్తోంది. మీరు పాత i20 N లైన్ మోడల్‌లో 60 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. మార్చి నెలలో హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ కోనా ఈవీ పై 4 లక్షల రూపాయల తగ్గింపును ఇస్తోంది.