Mahindra Car Offers: మహీంద్ర కార్లపై భారీ ఆఫర్స్.. ఈ విషయాలు వెంటనే తెలుసుకోండి?
వాహన కొనుగోలుదారులకు ఒక చక్కటి శుభవార్త. మహీంద్ర కార్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నావారికి ఇది గుడ్
- By Anshu Published Date - 04:15 PM, Tue - 15 November 22

వాహన కొనుగోలుదారులకు ఒక చక్కటి శుభవార్త. మహీంద్ర కార్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నావారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదేమిటంటే మహీంద్రాలో కొన్ని రకాల మోడల్ కార్లపై 62,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. కాగా ఆఫర్లు సైతం ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఏఏ మోడల్ పై ఎంతవరకు వరకు తగ్గింపు ధరలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహీంద్రా ఎక్స్ యూవీ 300 మహీంద్రా మరాజో మహీంద్రా బొలెరో లాంటి కార్లతో పాటు మరిన్ని కార్ల పై ఈ ఛాన్స్ లభిస్తోంది.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్, థార్, ఎక్స్ యూవీ700 మోడళ్లపై ఆఫర్లు అందుబాటులో లేవు. ఇకపోతే మహీంద్రా ఎక్స్ యూవీ 300 కార్ కొనుగోలు పై రూ.23,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ తో పాటు రూ.25,000 ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో పాటు రూ.10,000 విలువైన యాక్ససరీలను కొనుగోలుదారులు పొందవచ్చు. మహీంద్రా ఎక్స్ యూవీ300 పెట్రోల్ వేరియంట్ల పై ఈ ఆఫర్లు ఉన్నాయి. రూ.29,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.
దీంతోపాటుగా ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ రూ.25,000 వరకు అదనంగా లభించునుంది. రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.10,000 విలువైన యాక్ససరీలు ఉచితంగా పొందవచ్చు. మహీంద్రా మరాజో కార్ రూ.35,200 తగ్గింపుతో లభిస్తోంది. ఇందులో రూ.20వేల క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అలాగే రూ.10,000 వరకు ఎక్చేంజ్ బోనస్ దక్కుతుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,200 గా ఉంటుంది. అదేవిధంగా మహీంద్రా బొలెరో కారును రూ.28,000 వరకు డిస్కౌంట్ తో ఈనెలలో దక్కించుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.6,500, ఎక్చేంజ్ డిస్కౌంట్ రూపంలో రూ.10,000 వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 ఉంటాయి. అలాగే యాక్ససరీలపై రూ.8,500 విలువైన ఆఫర్స్ పొందవచ్చు.