Hero Vida V2 Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ 3 స్కూటర్లపై ఒక లుక్కేయండి!
ఆటోమొబైల్ తయారీ సంస్థ హీరో మోటో కార్ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి లాంచ్ చేసింది.
- Author : Anshu
Date : 09-12-2024 - 4:06 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హీరో మోటో కార్ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. మాస్ మార్కెట్ స్కూటర్ శ్రేణిలో విడా హీరో విడా వి2 స్కూటర్ తో ఎంట్రీ ఇచ్చింది. విడా వి2 లైట్ ధర రూ. 96 వేలు, విడా వి2 ప్లస్ ధర రూ. 1.15 లక్షలుగా ఉంది. టాప్-స్పెక్ విడా వి2 ప్రో ధర రూ. 1.35 లక్షలు అనే మూడు వేరియంట్‌లు ప్రస్తుతం అమ్మకానికి ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క వేరియంట్ వేర్వేరు బ్యాటరీ ప్యాకులను కలిగి ఉన్నాయి. హీరో విడా వి2 లైట్ 2.2kWh బ్యాటరీ ప్యాక్ తో పాటు ఐడీసీ రేంజ్ 94 కి.మీ. విడా వి2 లైట్ గంటకు 69 కి.మీ గరిష్ట వేగం, రైడ్, ఎకో అనే రెండు రైడ్ మోడ్ లు ఉన్నాయి.
రిమూవబుల్ బ్యాటరీని ఆరు గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. హీరో విడా వి2 లైట్ టీవీఎస్ ఐక్యూబ్ 2.2, బజాజ్ చేతక్ 2903 వంటి వాటికి పోటీగా వస్తోంది. హీరో వి2 ప్లస్ 3.44kWh బ్యాటరీ ప్యాక్ ఐడీసీ పరిధి 143 కి.మీ. హీరో వి2 ప్లస్ గంటకు 85 కి.మీ టాప్ స్పీడ్, ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్ లను పొందుతుంది. హీరో విడా వి2 ప్రో అనేది 3.94kWh బ్యాటరీ, 165 కి.మీ పరిధి, గంటకు 90 కి.మీ గరిష్ట వేగంతో అత్యంత లోడ్ వేరియంట్ అని చెప్పాలి. కాగా ఈ స్కూటర్ ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ అనే నాలుగు రైడింగ్ మోడ్ లను పొందుతుంది. మూడు స్కూటర్లలో పాత విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ పోలి ఉంటుంది.
కాగా ఈ స్కూటర్ లు మ్యాట్ నెక్సాస్ బ్లూ గ్రే, గ్లోసీ స్పోర్ట్స్ రెడ్ రెండు కొత్త కలర్ ఆప్షన్లతో ఉన్నాయి. హీరో విడా వి2 ప్రో స్వింగ్‌ఆర్మ్ మౌంట్ చేసిన పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ను పొందుతుంది. 6kW, 25Nm గరిష్ట టార్క్ ను కూడా అందిస్తుంది. అయితే అన్ని మోడల్ లు కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, రీ జెన్ బ్రేకింగ్, కస్టమ్ రైడింగ్ మోడ్ లు వంటి అనేక ఫీచర్లను పొందుతాయి. 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కూడా పొందవచ్చు. కొత్త విడా వి2 ఎలక్ట్రిక్ స్కూటర్లు వాహనం కోసం 5ఏళ్లు/50 వేల కి.మీ వారంటీ, బ్యాటరీ ప్యాక్ 3 ఏళ్లు/30 వేల కి.మీ వారంటీతో వస్తాయి.