Vida V1: హీరో ఈవీ స్కూటర్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ. అన్ని వేలు తగ్గింపు!
హీరో మోటో కార్ప్ ఈవీ వాహనంపై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్ ని అందిస్తోంది.
- By Anshu Published Date - 01:00 PM, Thu - 15 August 24

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వాలు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మద్దతు తెలుపుతుండడంతో వాహన వినియోగదారులు కూడా ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ వాహనాలకు బదులుగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.. అందుకు అనుగుణంగానే ప్రముఖ కంపెనీలో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు, వాటిపై ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి.
తాజాగా హీరో మోటోకార్ప్ కంపెనీ తన ఈవీ స్కూటర్ విడా వీ1 ప్లస్ ఈవీ స్కూటర్‌పై రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఈవీ స్కూటర్‌పై ఏకంగా రూ.32 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉండగా అమెజాన్‌లో మాత్రం రూ.32,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. హీరో విడా వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను స్పాట్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.27,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.32,000 తగ్గింపు అందిస్తున్నారు.
తాజాగా తగ్గింపులతో ఈ స్కూటర్‌ను రూ.91,000 నుంచి రూ.94,000 మధ్య కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ హీరో మోటోకార్ప్ దాని విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్కూటర్ హీరో సబ్ బ్రాండ్ విడా పేరుతో విక్రయాలు చేస్తున్నారు. ఈ స్కూటర్ బోల్డ్, మస్కులర్ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఈవీ స్కూటర్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లు, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఏడు అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ ప్లేతో పాటు కీలెస్ ఎంట్రీ, 26 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, మూడు విభిన్న రైడింగ్ మోడ్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు 143 కిమీ వరకు సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో 3.4 సెకన్లలో 0-40 కిలో మీటర్ వేగాన్ని అందుకుంటుంది. విడా వీ 1 ప్లస్ స్కూటర్ కు ఐదేళ్ల వారెంటీ లేదా 50,000 కి.మీ వారెంటీ లభిస్తుంది. అలాగే బ్యాటరీ ప్యాక్ మూడు సంవత్సరాలు లేదా 30,000 కి.మీ వారెంటీను కూడా అందిస్తున్నారు.