Ola: ఇలా చేస్తే చాలు ఫ్రీగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీ సొంతం?
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరువాత ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి బాగా
- By Nakshatra Published Date - 05:48 PM, Sun - 28 May 23
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరువాత ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి బాగా ఫేమస్ అయ్యారు. ఎంత పెద్ద విషయమైనా ఒక ముక్కలో తేల్చేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం ఇలా చేసేవారికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ మాట భవిష్ అగర్వాల్ చెబుతున్నాడు. అంతే కాదు మీమ్స్ చేసేవారికి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. మీమ్స్ చేసే వారి కష్టం కూడా చాలా ఉంటుంది. వాటి కోసం వారు ఎంతో కష్టపడతారు. ఇంత చేసినా ఫేమ్ వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి.
అయినా కానీ కొంతమంది తమ టాలెంట్ నిరూపించుకోవబడానికి ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఇలాంటివారి కోసం వెతుకుంటూ మరీ ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చిందనే చెప్పుకోవాలి. తాజాగా మీమ్స్ చేసే వారికి ఒక శుభవార్త చెప్పారు భవిష్ అగర్వాల్. ఇతను ఓలా ఎలెక్రిక్ ముఖ్య కార్య నిర్వహణాధికారీ అన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ICE అండ్ పెట్రో వెహికల్స్.. మీద మీమ్స్ క్రియేట్ చేయండి. వాటిలో ఎవరైతే బెస్ట్ గా చేస్తారో వారికి ఓలా ఎస్ 1 ప్రో స్పెషల్ ఎడిషన్ లభిస్తుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దీంతో ఇప్పటికే చాలా మంది వీటి మీద మీమ్స్ పోస్ట్ చేసి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యులకి స్కూటీ కొనడం అనేది ఒక కళ అని చెప్పవచ్చు. ఆ కళను మీ కళతో సాకారం ఇప్పుడే సాకారం చేసుకోండి. ఓలా ఎస్ 1 ప్రో స్కూటీ కావాలనుకునే వారు ICE అండ్ పెట్రో వెహికల్స్ మీద మీమ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కూటీ విలువ దాదాపు లక్ష రూపాయలు పైనే కావడం గమనార్హం. మీమ్స్ చేసేవారికి ఒకరకంగా ఇది సువర్ణావకాశం అని చెప్పవచ్చు.
Related News
EV Scooter: ఈవీ స్కూటర్ పై భారీగా తగ్గింపు.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్!
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ పై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే అందులో భాగంగానే విడా పే