Top automatic cars under 10 lakh: రూ.10 లక్షల బడ్జెట్ లోపు టాప్ ఆటోమెటిక్ కార్లు ఇవే.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ఇటీవల కాలంలో ఆటోమెటిక్ వెహికిల్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ కష్టాలను భరించలేక చాలా మంది ఆటోమెటిక్ ట
- By Nakshatra Published Date - 03:45 PM, Tue - 30 January 24
ఇటీవల కాలంలో ఆటోమెటిక్ వెహికిల్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ కష్టాలను భరించలేక చాలా మంది ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి మీరు కూడా ఒక ఆటోమెటిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. దేశంలో రూ. 10లక్షల బడ్జెట్ లోపు అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఆటోమెటిక్ వెహికిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మారుతీ సుజుకీ ఇగ్నిస్.. ఈ మారుతి సుజుకి కార్ క్రాసోవర్- హ్యాచ్‌బ్యాక్‌కి మిక్స్‌గా ఉంటుంది. ఎస్యూవీ కాకపోయినా డిజైన్ని చూస్తే మాత్రం ఇదొక మైక్రో ఎస్యూవీ అనిపిస్తుంది. ప్రీమియం నెక్సా షోరూమ్స్‌లో వీటిని విక్రయిస్తోంది మారుతీ సుజుకీ. ఇందులో 1.2 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ దీని సొంతం. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 6.93 లక్షలు రూ. 8.16లక్షల మధ్యలో ఉంటుంది.
అలాగే ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఈ టాటా పంచ్ ఒకటి. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఏఎంటీ వర్షెన్‌లో 12 ట్రిమ్స్ ఉండటం విశేషం. వీటిల్లోని 11 ఆప్షన్స్ ధర రూ. 10లక్షల కన్నా తక్కువగా ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్ని పక్కన పెడితే.. ఈ టాటా పంచ్ ఏఎంటీ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ. 7.50లక్షలు రూ. 9.35లక్షల మధ్యలో ఉంటుంది. ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కి 5 స్పీడ్ ఏఎంటీ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది 87 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్.. హ్యుందాయ్ నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్టర్ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఏఎంటీ వర్షెన్‌లో ఆరు వేరువేరు ట్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్.. 82 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఆరు వేరువేరు ట్రిమ్స్లని ఐదంటి ఎక్స్‌షోరూం ధర రూ. 10లక్షల లోపే ఉంటాయి.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్.. 2023లో లాంచ్ అయిన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలెనోకి క్రాసోవర్ లా కనిపిస్తుంది. ఇందులో 1.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌కి ఏఎంటీ కనెక్ట్ చేసి ఉంటుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఆటో మెటిక్ ఎక్స్‌షోరూం ధర రూ. 8.88 లక్షలు రూ. 9.28లక్షల మధ్యలో ఉంటుంది.
Tags
Related News
Tata Punch EV: టాటా పంచ్ EVపై మెదటిసారిగా భారీ తగ్గింపు..!
ఈ సంవత్సరం జనవరిలో టాటా మోటార్స్ పంచ్ ఈవీ (Tata Punch EV)ని విడుదల చేసింది.