Hyundai Casper EV: హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్.. పూర్తి వివరాలివే?
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ మోటార్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని విడుదల చేసేందుకు ప్లాన్ లను సిద్ధం చేస్తోంది. ఆ
- By Nakshatra Published Date - 08:30 PM, Sun - 11 February 24
![Hyundai Casper EV: హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్.. పూర్తి వివరాలివే?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/MixCollage-11-Feb-2024-08-29-PM-8171.jpg)
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ మోటార్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని విడుదల చేసేందుకు ప్లాన్ లను సిద్ధం చేస్తోంది. ఆ వెహికల్ పేరు హ్యుందాయ్ కాస్పర్ ఈవీ. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. కాగా ఈ వెహికల్ ని ఈ ఏడాది చివర్లో ఇది అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ కి సంబంధించి, ఒక వార్త బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా వీధుల్లో హ్యుందాయ్ కాస్పర్ ఈవీ టెస్ట్ రన్ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
ఇకపోతే ఈ వెహికల్ కీ సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. హ్యుందాయ్ కాస్పర్ ఈవీ ఒక బుడ్డ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లో ఉన్న కాస్పర్కి, త్వరలోనే లాంచ్ అయ్యే ఈవీ వర్షెన్ డిజైన్‌కి మధ్య పెద్దగా తేడా కనిపించడం లేదు. కాస్పర్ ఈవీలో సర్క్యులర్ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ లైట్ సిగ్నేచర్స్పై పారామెట్రిక్ పిక్సెల్ పాటర్న్స్, స్లీక్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ వంటివి ఉన్నాయి. ఈ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో స్పోర్టీ అలాయ్ వీల్స్, సీ పిల్లర్ మౌంటెడ్ రేర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్డ్ ఔట్ ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ వంటివి కనిపిస్తున్నాయి. కాగా పెట్రోల్ వర్షెన్‌తో పోల్చుకుంటే హ్యుందాయ్ కాస్పర్ ఈవీ వీల్‌బేస్ కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే కేబిన్ స్పేస్ మరింత పెరుగుతున్నట్టు అవుతుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అడ్వాన్స్డ్ బ్యాటరీ ప్యాక్‌ని హ్యుందాయ్ వినియోగిస్తుందని టాక్ నడుస్తోంది. ఈ బ్యాటరీ ప్యాక్ రేంజ్ 320 కి.మీలుగా ఉంటుందని సమాచారం. దీనిపై ప్రస్తుతం క్లారిటీ లేదు. హ్యుందాయ్ కాస్పర్ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో భారీ 10 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హీటెడ్ స్టీరింగ్ వీల్, హీటెడ్ ఫ్రెంట్ సీట్స్, ఆర్టిఫీషియెల్ లెథర్ అప్‌హోలిస్ట్రీ, వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్, సింగిల్ పన్ సన్‌రూఫ్, మూడ్ ల్యాంప్, బ్లూలింక్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఉంటాయని సమాచారం. హ్యుందాయ్ కొత్త ఈవీలో ఆడాస్ ఫీచర్స్ కోసం ఫ్రెంట్ రేడార్ మాడ్యూల్ ఉంటుందట. ఇకపోతే దీని ధర విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా మార్కెట్లో హ్యుందాయ్ కాస్పర్ ఈవీ ధర 40వేల ఏయూడీగా ఉండొచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో అది సుమారు రూ. 21.55లక్షలు గా ఉండనుంది.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Hyundai Inster EV: హ్యుందాయ్ నుంచి మరో కారు.. త్వరలోనే భారత్‌లో లాంచ్!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/safeimagekit-Hyundai-Inster-EV-1_11zon.jpg)
Hyundai Inster EV: హ్యుందాయ్ నుంచి మరో కారు.. త్వరలోనే భారత్‌లో లాంచ్!
Hyundai Inster EV: హ్యుందాయ్ తన సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV INSTERను (Hyundai Inster EV) బుసాన్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో విడుదల చేసింది. హ్యుందాయ్ ఈ కొత్త మోడల్‌ను ఎ సెగ్మెంట్లో విడుదల చేసింది. దీని ధర ఇంకా వెల్లడించలేదు కానీ దాని అన్ని ఫీచర్ల గురించిన సమాచారం కంపెనీ ఇచ్చింది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. భద్రత కోసం అనేక మంచి ఫీచర్లను ఇందులో పొందుపర�