HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Automobile
  • >A Three Wheeled Car 200 Kilometers On A Single Charge Strom R3

Strom R3: పేరుకే మూడు చక్రాల బుల్లి కారు.. కానీ ఫీచర్లు తెలిస్తే మాత్రం దిమ్మతిరగాల్సిందే!

మరికొద్ది రోజుల్లోనే మూడు చక్రాలు కలిగిన బుల్లి ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి విడుదల కానుంది. కారు చిన్నదే అయినప్పటికీ ఫీచర్లు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

  • By Anshu Published Date - 10:33 AM, Sun - 15 December 24
  • daily-hunt
Strom R3
Strom R3

దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం సామాన్య అలాగే మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యతరగతి కుటుంబాలలోని వ్యక్తులు ఎక్కువ శాతం మోటార్ సైకిల్స్ ని వినియోగిస్తూ ఉంటారు. కారు కొనుగోలు చేసే అంత స్తోమత ఉండదు. కొంతమంది చిన్న చిన్నగా డబ్బులు పొదుపు చేసుకొని బడ్జెట్ ధరలో ఉండే కార్లను కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. ఇలా కార్లను కొనుగోలు చేయలేని వారు బస్సులు, రైళ్లు తదితర ప్రయాణ సాధనలపై ఆధారపడతారు. ఇక అత్యవసర సమయంలో ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి వారందరి కోసం తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. స్ట్రోమ్ ఆర్3 పేరుతో విడుదలైన ఈ కారును ఒక్కసారి రీచార్జి చేస్తే సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చట.

ఈ కారు చూడడానికి చిన్నగా మూడు చక్రాలతో ఉన్నప్పటికీ ఈ కారు ఫీచర్లు మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కాగా స్ట్రోమ్ ఆర్3 పేరుతో విడుదల చేసిన ఈ కారుకు మూడు చక్రాలు ఉంటాయి. స్ట్రోమ్ ఆర్3 ఎలక్ట్రిక్ కారు ధర రూ.4.5 లక్షలు మాత్రమే. దీన్ని ఒక్కసారి రీచార్జి చేస్తే దాదాపుగా 200 కిలో మీటర్ల రేంజ్ ని అందిస్తుందట. దీనిలో శక్తివంతమైన ఎలక్ట్రిక్ బ్యాటరీ, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ కారుకు రెండు డోర్లు ఏర్పాటు చేశారు. మూడు చక్రాలు అమర్చారు. ఆకర్షణీయమైన డిజైన్, చిన్న బానెట్, విశాలమైన ఎయిర్ డ్యామ్, ఎల్ ఈడీ లైట్లు, డ్యూయల్ టోన్, సన్ రూఫ్ వంటి ఫీచర్స్ యూజర్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాల విషయానికొస్తే..

ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు పొడవు 2907, వెడల్పు 1405, ఎత్తు 1572, గ్రౌండ్ క్లియరెన్స్ 185 మి.మీలుగా ఉన్నాయి. కారు మొత్తం బరువు 550 కిలోలు ఉంటుంది. దీనికి 13 అంగుళాల స్టీల్ వీల్స్ అమర్చారు. స్ట్రోమ్ ఆర్ 3 కారు ఇంకా మార్కెట్ లోకి విడుదల కాలేదు. దీనికి తుది మెరుగులు దిద్దడంలో కంపెనీ బిజీగా ఉంది. అవన్నీ పూర్తయ్యాక, పరీక్షలు జరిపి, ఎలాంటి లోటుపాట్లు లేవని నిర్ధారణ అయిన తర్వాత కారును మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారుకు ప్రజల ఆదరణ బాగుంటుందని భావిస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభించడం, మెరుగైన రేంజ్ కారణంగా అందరికీ దీనిపై ఆసక్తి నెలకొంది. అలాగే డిజైన్ కూడా చాలా అద్బుతంగా ఉంది. మూడు చక్రాలలో చాలా అందంగా తీర్చిదిద్దారు. మరి ఈ కారును మార్కెట్లోకి వచ్చిన తర్వాత వినియోగదారులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 wheeler
  • electric car
  • Strom R3
  • Strom R3 car features
  • Strom R3 car price
  • Strom R3 electric car

Related News

    Latest News

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd