2025 Honda Activa 125: 2025 హోండా యాక్టీవా 125 బైక్ వచ్చేసిందోచ్.. ధర ఫీచర్లు ఇవే!
మార్కెట్ లోకి హోండా సంస్థ 2025 హోండా 125 బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.
- By Anshu Published Date - 10:30 AM, Mon - 23 December 24

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా ఇప్పటికే చాలా రకాల బైకులను, స్కూటర్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైక్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అప్‌డేటడ్ 125 సీసీ యాక్టివాను రూ. 94,422 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. ఇది లేటెస్ట్ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది. 2025 యాక్టివా 125 అప్‌గ్రేడ్ చేసిన 123.92సీసీ, సింగిల్ సిలిండర్ పీజీఎమ్ ఎఫ్ఐ ఇంజన్ తో ఇప్పుడు ఓబీడీ2బీ కంప్లైంట్, 6.20కిలో వాట్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ లో ఇడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ఉంటుంది.
ఎక్స్‌టెండెడ్ స్టాప్ ల సమయంలో ఇంజిన్ ను ఆటో మేటిక్‌గా ఆపివేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ యాక్టివా 125 బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త 4.2 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లేను కూడా కలిగి ఉందట. హోండా రోడ్‌సింక్ యాప్ కు సపోర్టుగా ఉంటుంది. నావిగేషన్ కాల్/మెసేజ్ అలర్ట్ లు, ప్రయాణంలో రైడర్ లను కనెక్ట్ చేయడం వంటి ఫంక్షన్ లను ఎనేబుల్ చేస్తుంది. అదనపు సౌలభ్యం కోసం యూఎస్‌బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ను కూడా కలిగి ఉంది.
ఈ స్కూటర్ ప్రయాణిస్తున్నప్పుడు రైడర్ లు తమ డివైజ్ లను ఛార్జ్ చేసేందుకు అనుమతిస్తుంది. అప్‌డేట్ అయిన యాక్టివా 125 సిగ్నేచర్ సిల్హౌట్ ను కలిగి ఉంది. అయితే, కొత్త కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్లు, లోపలి ప్యానెల్ లను కలిగి ఉంది. వ్యూ మోడ్ మరింత ఆకర్షణగా ఉంటుంది. కాగా ఈ స్కూటర్ పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెరల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ప్రెషియస్ వైట్ అనే 6 కలర్ ఆప్షన్ లతో డీఎల్ఎక్స్, హెచ్ స్మార్ట్ అనే 2 వేరియంట్ లలో లభిస్తుంది. హోండా డీఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ. 94,442 అయితే హెచ్-స్మార్ట్ ధర రూ. 97,146 2025 యాక్టివా 125 ఇప్పుడు భారత మార్కెట్లో డీలర్‌షిప్ లలో అందుబాటులో ఉంది.