Lexus NX hybrid SUV:మార్కెట్లోకి లెక్సస్ కొత్త లగ్జరీ కారు…అదిరిపోయే ఫీచర్లు..!!
లగ్జరీ కార్ల తయారీ దారు సంస్థ భారత మార్కెట్లో కొత్త జనరేషన్ ఎన్ఎక్స్ఎస్ యూవీని ఆవిష్కరించింది. ఇది సెకండ్ జనరేసన్ లగ్జరీ SUV. ఈ కారు డిజైన్ చూడాటానికి చాలా షార్ప్ గా ఉంటుంది.పెద్దస్పిండిల్ గ్రిల్, సరికొత్త హెడ్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.
- By Hashtag U Published Date - 01:36 PM, Tue - 15 March 22
లగ్జరీ కార్ల తయారీ దారు సంస్థ భారత మార్కెట్లో కొత్త జనరేషన్ ఎన్ఎక్స్ఎస్ యూవీని ఆవిష్కరించింది. ఇది సెకండ్ జనరేసన్ లగ్జరీ SUV. ఈ కారు డిజైన్ చూడాటానికి చాలా షార్ప్ గా ఉంటుంది.పెద్దస్పిండిల్ గ్రిల్, సరికొత్త హెడ్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ స్పోర్ట్స్ లుక్ తో కనిపిస్తుంది. పెద్దగా ఉండే 20 అంగుళాల వీల్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ స్టైలింగ్ చూస్తే…టేపరింగ్ రూఫ్ లైన్ ను అందించారు. లైట్ బార్ బ్యాక్ సైడ్ ల్యాంప్స్ కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక ఇంటీరియర్ కూడా లేటెస్టుగా ఉంది. 14అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లేను ఇందులో అమర్చారు. వీటన్నింటితోపాటుగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉంది.
ఇంటీరియర్ డిజైన్ పూర్తిగా మార్చేశారు. ఈకొత్త ఎన్ఎక్స్ లో లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి. ప్రీ కొలిజన్ సిస్టమ్,డైనమిక్ రాడార్ క్రూజ్ కంట్రోల్,లేన్ డిపార్చర్ అలెర్ట్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, ఆటో హై బీం సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్లను ఇందులో అందించారు. బ్లైండ్ స్పాట్ మానిటర్,రేర్ క్రాస్ ట్రాఫిక్ అలెర్ట్,రేర్ కెమెరా డిటెక్షన్ ఉన్నాయి. హెచ్ యూడీ, పనోరమిక్ సన్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సీట్లు, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
లెక్సస్ ఎన్ఎక్స్ హైబ్రిడ్ ఎస్ యూవీలో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎక్స్ క్విజిట్, లగ్జరీ, ఎఫ్ -స్పోర్ట్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్ ఎక్స్ 350 హెచ్ ఎక్స్ క్విజిట్ ధర రూ. 64.9లక్షలు. ఎన్ ఎక్స్ 350 హెచ్ లగ్జరీ వేరియంట్ ధర రూ. 69.5లక్షలు. ఇక ఎన్ ఎక్స్ 350 హెచ్ ఎఫ్ స్పోర్ట్ ధర రూ. 71.6 లక్షలు.
లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్ ఇంజిన్ 2.5లీటర్ అట్కిన్సన్ సైకిల్ నాలుగు సిలిండర్ ఇంజన్ను కలిగి ఉంటుంది. ఇంజిన్ రెండు యాక్సిల్స్ లో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎలక్ట్రిక్ మోటార్స్ తో అమర్చబడి ఉంటుంది. పవర్ అవుట్ పుట్ 244 హెచ్ పి. ఇంజిన్ 192హెచ్ పి శక్తిని ప్రొడక్ట్ చేస్తుంది. గేర్ బాక్స్ 6స్పీడ్ e-CVT యూనిట్ ను కలిగి ఉంటుంది. కారు హైబ్రిడ్ యూనిట్ సెల్ఫ్ ఛార్జింగ్ యూనిట్ ఉంటుంది. దీనిని రీఛార్జీ చేయాల్సిన పనిలేదు. హైబ్రిడ్ యూనిట్ 55కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.