Maruti Alto K10: ఆగస్టు 18న “ఆల్టో K10” వస్తోంది.. ఫీచర్స్ ఇవే!!
భారతదేశంలోని ఓల్డ్ హ్యాచ్‌బ్యాక్‌లలో సుజుకి ఆల్టో ఒకటి. దానిని మోస్ట్ అడ్వాన్స్డ్ అప్డేట్స్తో ఆల్టో K10గా మారుతి సుజుకి అందుబాటులోకి తీసుకురానుంది.ఇది ఆగస్టు 18న విడుదల కాబోతోంది.
- By Hashtag U Published Date - 08:45 AM, Wed - 17 August 22
భారతదేశంలోని ఓల్డ్ హ్యాచ్‌బ్యాక్‌లలో సుజుకి ఆల్టో ఒకటి. దానిని మోస్ట్ అడ్వాన్స్డ్ అప్డేట్స్తో ఆల్టో K10గా మారుతి సుజుకి అందుబాటులోకి తీసుకురానుంది.ఇది ఆగస్టు 18న విడుదల కాబోతోంది.
లాంచ్‌కు ముందు ఈ కారుకు సంబంధించిన పలు ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీని ధర రూ.3.50 లక్షల నుంచి రూ.7 లక్షలు. రూ. 11,000 టోకెన్ అమౌంట్‌గా చెల్లించాలని కంపెనీ వెల్లడించింది.ఈనేపథ్యంలో ఆల్టో K10 కారు ఎలా ఉంటుంది? దానిలోని ఫీచర్స్ ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆల్టో కె10లో ఏముంది?
* ఆల్టో కె10 కారు.. మారుతి సుజుకి సెలెరియో మాదిరిగానే హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది.
* ఈ కొత్త కారును ప్రస్తుతం భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్టో 800తో పాటు విక్రయిస్తారు.
* ఈ కారు 12 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
* ఈ కారులో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (AMT), మాన్యువల్ ట్రాన్స్మిషన్ (MT) వేరియంట్లు ఉంటాయి.
* ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో కూడిన 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల రియర్ వ్యూ మిర్రర్స్ (OVRM), పవర్ విండోలు, రిమోట్ కీ ఉన్నాయి.
* కొత్త ఆల్టో కె10 ఎర్త్ గోల్డ్, సిల్కీ వైట్, స్పీడీ బ్లూ, సాలిడ్ వైట్, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అవుతుంది.
* ఇందులో వెనుకవైపు పార్కింగ్ సెన్సార్లు, ABS డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
* ఈ కారులో హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, స్క్వేర్డ్ టెయిల్ ల్యాంప్‌లు, ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్లు ఉంటాయి.
* కె10సి డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.
Related News
Maruti Rolls Royce : మారుతీ 800ను రోల్స్ రాయిస్ గా మార్చేశాడు
Maruti Rolls Royce : కేరళకు చెందిన యువకుడు హదీఫ్ మారుతీ 800 కారును రోల్స్ రాయిస్ కారుగా మార్చేశాడు.