Ducati: డుకాటి ఇండియా సూపర్ బైక్స్ ధరలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
డుకాటి ఇండియా 2022 పానిగేల్ వీ4 రేంజ్ బైక్స్‌ను తాజాగా విడుదల చేసింది. కాగా ఇవి 3 వెరియంట్ లలో
- By Nakshatra Published Date - 07:45 AM, Wed - 31 August 22
డుకాటి ఇండియా 2022 పానిగేల్ వీ4 రేంజ్ బైక్స్‌ను తాజాగా విడుదల చేసింది. కాగా ఇవి 3 వెరియంట్ లలో లభిస్తున్నాయి. స్టాండర్డ్, ఎస్,ఎస్పీ-2 ఇలా మూడు వేరియంట్ లలో ఈ సూపర్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా సూపర్ బైక్స్ ధర విషయానికి వస్తే ఎక్స్ షోరూం నుండి రూ.26.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ డుకాటీ ఇండియా సంస్థ బైక్ ఫీచర్లను అప్డేట్ చేయడంతో పాటుగా ధరలను కూడా అమాంతం ఒక రేంజ్ లో పెంచేసింది. కొత్త గ్రాఫిక్‌లతో పాటుగా అద్భుతమైన డిజైన్ తో 2022 పనిగేల్ వీ4 బైక్స్‌ని అప్డేట్ చేసింది డుకాటి సంస్థ. ఇకపోతే ఈ సూపర్ బైక్స్ ధరల విషయానికి వస్తే..
బేస్ వేరియంట్ ధరను గతంలో కంటే ప్రస్తుతం రూ. 3 లక్షలు పెంచింది. అలాగే ఎస్ ధర రూ. 31.99 లక్షలు, ఎస్పీ2 ధర రూ. 40.99 లక్షలు. ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నై లాంటి ప్రధాన నగరాలలో అన్ని డుకాటీ డీలర్ షిప్‌లలో మొత్తం 3 వేరియంట్ల బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఇంజీన్ 1103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్. దీనికి కొత్తగా సైలెన్సర్ ఆయిల్ పంప్‌ను జోడించింది. దీనివల్ల ఈ ఇంజీన్ సామర్థ్యం 13,000 ఆర్పిఎం వద్ద 215. హెచ్ పి P , 9500 ఆర్పిఎం వద్ద 123.6 Nm వరకు పెరిగిందని డుకాటి కంపెనీ ప్రకటించింది. అంతే కాకుండా దీనికి ఫీల్లీ రెడ్ ఫెయిరింగ్ లపై బ్లాక్ లోగోలు, డబుల్ ఫాబ్రిక్ సాడిల్, అలాగే బ్లాక్ రిమ్స్‌పై రెడ్ ట్యాగ్ లను జోడించింది.
ఇక హై ఎండ్ వేరియంట్ ఎస్పీ 2లో..1103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ ను అమర్చింది. ఇటాలియన్ ఫ్లాగ్ తో కూడిన కార్బన్ ఫైబర్‌లో వింగ్స్, STM-EVO SBK 9 డిస్క్ డ్రై క్లచ్, డెడికేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ స్ప్రాకెట్స్, 520 చైన్, ఎడ్జస్టబుల్ రైడర్ ఫుట్-పెగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ అడ్జస్టర్, మెషిన్డ్ బ్రేక్, క్లచ్ లివర్లతో కూడిన బ్రెంబో ఎంసిస్ మాస్టర్ సిలిండర్, 9 స్పోక్ ఫోర్డ్ మెగ్నీషియం వీల్స్, కార్బన్ ఫైబర్‌లో ఫ్రంట్ మడ్‌గార్డ్ , సింగిల్ సీట్ ఇందులో ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
Related News
Ducati motorcycles: డుకాటీ బైక్‌ల ధరల పెంపు.. అప్పటి నుంచే ధరలు పెంపు..!
డుకాటీ (Ducati) గురించి మనందరికీ తెలుసు. ఈ కంపెనీ ఇటలీకి చెందిన ప్రీమియం స్పోర్ట్స్ బైక్ తయారీదారు. మీరు స్పోర్ట్స్ బైక్ ప్రియులా.. మీరు కూడా డుకాటి (Ducati) బైక్‌లను కొనాలని చూస్తున్నారా..? అయితే.. మీరు మీ కలను సాకారం చేసుకోవాలనుకుంటే దానికి ఇదే ఉత్తమ సమయం. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో Ducati తన అన్ని బైక్‌ల ధరలను పెంచబోతోంది.