YS Sharmila : బాలకృష్ణ డైలాగ్స్ తో వైవీ సుబ్బారెడ్డి కి సవాల్ విసిరిన షర్మిల
- By Sudheer Published Date - 01:40 PM, Tue - 23 January 24

వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)గారు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. మేము చూడటానికి సిద్దంగా ఉన్నాం. టైం,డేట్ మీరు చెప్పిన సరే,మమ్మల్ని చెప్పమన్నా సరే రెడీ. మీరు చేసిన అభివృద్ధి చూసేందుకు మేమే కాదు, మీడియా, మేధావులు, ప్రతిపక్ష పార్టీల వారు కూడా వస్తారు అంటూ బాలకృష్ణ డైలాగ్స్ పేల్చి షర్మిల (YS Sharmila) వార్తల్లో నిలిచారు.
ఏపీ PCC చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైస్ షర్మిల..తన దూకుడు ను కనపరుస్తుంది. బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ ఫై నిప్పులు చెరిగి వార్తల్లో నిలిచింది. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు సైతం గట్టి కౌంటర్లే వేశారు. స్వయంగా అన్నను పట్టుకొని జగన్ రెడ్డి అంటుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి షర్మిల స్పందించింది.
We’re now on WhatsApp. Click to Join.
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని(North Andhra Districts) కీలకమైన శ్రీకాకుళం నుంచి షర్మిల తన యాత్రను ప్రారంభించారు. పలాస నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సు ఎక్కిన షర్మిల..ఇచ్ఛాపురం వరకు బస్సులోనే ప్రయాణించారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్, ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..’నేను జగన్ రెడ్డి అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చలేదట. ఇప్పటినుంచి జగన్ అన్నగారు అనే అంటా. అభివృద్ధి చూపిస్తానని నాకు సవాల్ విసిరారు. సరే సార్.. చూపించండి. తేదీ, సమయం మీరు చెప్పినా సరే.. నేనైనా చెబుతా. అభివృద్ధి పరిశీలనకు మేధావులు, మీడియా, ప్రతిపక్షాలను కూడా పిలుద్దాం’ అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడో చూపించండి..మెట్రో ఎక్కడో చూపించండి..రోడ్ల పరిస్థితి ఏంటో తెలపండి..రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కంపెనీల ఎక్కడ ఉన్నాయో చూపించండి..నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో లిస్ట్ ఇవ్వండి..మీరు కడతానన్న పోలవరం ఎక్కడ? అంటూ వరుస ప్రశ్నలు షర్మిల అధికార పార్టీ కి సంధించింది.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా బీజేపీ రాజ్యమేలుతోందని , ఏపీ సీఎం, వైసీపీ ఎంపీలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని, ప్రత్యేక హోదాపై బీజేపీని ఎందుకు నిలదీయడం లేదని షర్మిల అన్నారు. రాహుల్ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తారు’ అని షర్మిల స్పష్టం చేశారు.
Read Also : Lok Sabha Polls : ఏప్రిల్ 16.. లోక్‌సభ పోల్స్ తేదీపై క్లారిటీ ఇచ్చిన ఈసీ