CBN : ఏపీ సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ షర్మిల
”ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలి. గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. పవన్ కల్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు”
- By Sudheer Published Date - 09:58 PM, Wed - 12 June 24

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు (Chandrababu) కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) శుభాకాంక్షలు తెలియజేసింది. ఈమేరకు ఆమె లేఖ విడుదల చేశారు. ”ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలి. గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. పవన్ కల్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు” అని లేఖలో పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలని సూచించారు. ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో షర్మిల కడప నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే. తన ప్రచారం అంత కూడా జగన్ , అవినాష్ లపై చేస్తూ సాగింది. చిన్నాన్న వైఎస్ వివేకానందా హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని..జగన్ ఫై విమర్శలు చేస్తూ వచ్చింది.
Read Also : Chandrababu : రేపు సాయంత్రం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు..ఆ మూడు ఫైల్స్ సంతకం